Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

"సరే సరే" పిట్ట కథ - ఎ వి ఎమ్

sare sare pitta katha

"కూరలు తీసుకొస్తా మా...నసా! తలుపేసుకో" గావుకేక పెట్టాడు మహర్షి

మా..'నసా' అని పిలవొద్దన్నాన! ధడేలున తలుపు వేసుకుంది మానస

"నువ్వు టీ వీ చూస్తూ వుండు" అన్నాడు బెట్టుగా

"అది నువ్వు చెప్పాలా! సరే సరే"

"వస్తూ వస్తూ చిల్లర సరుకులు తెస్తా"

"ఊ .. సరే సరే"

"మన బుజ్జిగాడి స్కూలు ఫీజు కట్టోస్తా "

"సరే సరే"

"గ్యాసు, బ్యాంకు పని, అధార్ కార్డు గొడవ చూసొస్తా!"

"ఊ .. సరే సరే"

"అట్నించి అటే అమ్మా నాన్న వున్న ఆశ్రమానికి వెళ్ళి పలకరించి వస్తా!"

"వద్దు "

మరిన్ని శీర్షికలు
edi aa kammadanam