Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
padyam - bhavam

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్టూనిస్టులతో తుంటర్వ్యూలు - ..

క్వశ్చన్స్  అయిపోయేలోపు ఇంటర్వ్యూ పూర్తి చేస్తారా అర్జున్?

 ఐ ఏ ఎస్ లెవల్లో మాత్రమే క్వశ్చన్స్  ఇచ్చారు... నాది ఐ టి ఐ కాబట్టి పేపర్ ని చించేస్తా.. !!

గాల్లో దీపం పెట్టి కార్టూన్లు గీస్తే ఏమవుతుంది?

 ఆ దేవుడు కూడా నా కార్టూన్లను కాపాడలేడు... ఎంచక్కా గాలికి, కొట్టుకూ, పోతాయ్..

కార్టూన్లు పాండవుల కంటే కౌరవులకే ఎక్కువ అవసరమా?

నాకు తెలిసి.. వాళ్ళందరికంటే ముందు.. మెంటల్ టెన్షన్ పోవడానికి శ్రీకృష్ణుడికి మాత్రం చాలా అవసరం.

ఒక వంకాయతో ఎన్ని కార్టూన్లు గీయగలరు మీరు?

ఈ రోజుల్లోనైతే బంగారప్పాలీ తోనైతే గీయగలమేమోగానీ అమ్మో.. వంకాయంతటి గొప్పదాంతోనైతే నా వల్ల కాదు...

మీరొక కార్టూనిస్ట్ అయి ఉండీ ఇంతవరకూ ఒక్క కార్టూన్ కూడా గీయలేదా?

సొంతంగా గీస్తే అస్సలు పడట్లేదు మరి... అందుకే కార్బన్ పేపర్ వాడుతున్నా మరి...

ప్రమాదాలను నివారించాలంటే ఏ పద్ధతిలో కార్టూన్లు గీయాలి?

రాత్రి తొమ్మిది తరువాత లైటు తీసేసి...లేకపోతే నేను సూర్యోదయంచూట్టం కష్టం...

ఎవరికి చెప్పి కార్టూన్లు గీస్తారు?

అందరూ బబ్బున్నాక, అర్ధరాత్రి పిల్లిలా లేచి నాకు నేనే చెప్పుకుంటాను... ధైర్యం!!

కార్టూన్లు గీస్తూంటే పరిస్థితులెటు దారి తీస్తాయి?

ఇంట్లోనైతే నా శ్రీమతి నాపై.. తనకు  టైం స్పెండ్ చేయటంలేదని నెలకో రెండు ,మూడు గంటెలు విరగ్గొడుతుంది, అప్పుడప్పుడు ఒక గిన్నె కూడా సొట్ట పోగొడ్తుంది.

మంచి కార్టూన్ గీసినప్పుడు బాధపడతారా?

క్రింద పడి గిలగిలా కొట్టుకుని కుళ్ళికుళ్ళిఏడుస్తాను.

సమాజం మీ కార్టూన్లకిచ్చే సందేశమేదైనా ఉందా?

ఒళ్ళు దగ్గరపెట్టుకుని అస్త్రాలు సంధించకోయ్ అర్జునా... లేకపోతే ఆ బాణపుల్లలు తిరిగొచ్చి నీ ఒళ్ళంతా గుచ్చుకుంటే పీక్కోలేక చస్తావ్ అని చెప్తుంటుంది.

స్వచ్చ కార్టూన్ లో పాల్గొంటున్నారా?

మచ్చలేకుండా ప్రయత్నిస్తుంటాను.

నూతన మద్యం పాలసీ మీ కార్టూన్లకు ఏమైనా మేలు చేస్తుందా?

జీవన సురక్షపాలసీ, మనీ బ్యాంక్ పాలసీ వంటి ఇన్సూరెన్స్ పాలసీలైతే కార్టూన్లకు మేలుగానీ, నూతన మధ్యం పాలసీ మీదైతే నా కార్టూన్లలోని పాత్రలు జబ్బులతో బబ్బుంటాయి.

మీ కార్టూన్ల ద్వారా ఏటా ప్రభుత్వానికెంత ఆదాయం వస్తుంది?

ఇది రాజకోట ఖజానా రహస్యం... అస్సలు చెప్పకూడదు.

మీ కార్టూన్లను విగ్రహాలు చేయించాలనే ఆలోచనెప్పుడూ రాలేదా?

ఆ ఆలోచన వచ్చిందో ... మా భద్రాచలం లో "బాపు" గారి గీతల్తో రూపుదిద్దుకున్న రామలక్ష్మణుల బొమ్మలు వారి బాణాలతో నన్ను వేటాడేస్తారు.

రావణాసురుడికి మీ కార్టూన్లిస్తే, ఏ తలకాయ్ తో చూడొచ్చు?

గ్యారెంటీగా సెంటర్ తలకాయతోనైతే శీతకన్నేస్తాడు... కనీసం ఏదో తలకాయతో కూడా చూడడు.. ఎందుకంటే.. ఆయనకి తెలుగు రాదుగా...!!!

మీ కార్టూన్లకు ఫాలోయింగ్ ఎన్ని కిలోలుండొచ్చు?

అబ్బో.. చాలుంది.. నాకు తెలిసి.. 100గ్రాములు గ్యారెంటీ...!!

మీ కార్టూన్లు చూడాలంటే శ్రీలంకకు వెళ్ళాల్సిందేనా?

అంత దూరమెంతుకు.. "తుంగ" లో తొక్కడానికి, నేను అప్పుడప్పుడూ "రణం" కి హైద్రబాదొస్తా కదా..
అప్పుడు చూడొచ్చు!!


ఏ పత్రికా మీ కార్టూన్లు తిప్పి పంపకపోతే  ఏం జరిగేది?

చేసేదేముంది.. ఫేస్ బుక్ లో నేనొక కొత్త గ్రూప్ ని క్రియేట్ చేసుకుని.. ఎంచక్కా అందులో అచ్చేస్కుంటాగా..

మీ తుంటర్వ్యూ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు?

19.6.2015 శుక్రవారం తదియ, మధ్యాహ్నం సరీగ్గా ఒంటిగంటకి జీలకర్ర బెల్లం గ్యారెంటీగా స్టార్ట్ చేస్తా...!!  

మరిన్ని శీర్షికలు
Kanda bachali kura