Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nandita likes mahesh

ఈ సంచికలో >> సినిమా >>

హీరో, విలన్‌ రెండూ అతడేనట

surya as hero & vilan
విభిన్న పాత్రలతో ఎప్పటికప్పుడు న్యూలుక్‌లో కనిపించడానికి తహతహపడే హీరోలలో సూర్య ఒకడు. ఈ మధ్య ఈ హీరో చేసిన సినిమాలన్నింటికీ చుక్కెదురే అవుతుంది. డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌తో వచ్చినప్పటికీ ఆదరణ కరువైంది. 'సింగం' సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు సూర్య. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ పవర్‌ఫుల్‌ హీరో. వీటిలో కూడా కొత్తదనమే చూపిస్తానంటున్నాడు. ఒక సినిమా 'పసంగ - 2'. రెండోది '24'. 'పసంగ 2'లో చిన్న పిల్లలతో కలిసి మంచి మెసేజ్‌ను పాస్‌ చేయాలనుకుంటున్నాడు. ఒక పాటలో అంతమంది పిల్లలతో ఎంతో ఆప్యాయంగా మెలగుతూ కనిపిస్తున్నాడు

ఈ సినిమాలో సూర్య. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఈ పాటని చిత్రీకరించారు. ఇక రెండో సినిమా '24' లో చాలా స్పెషాలిటీసే ఉన్నాయి. ఈ సినిమాలో సూర్య విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడట. అందులో ఒకటి హీరో, ఇంకోటి విలన్‌ పాత్ర. ముఖ్యంగా విలన్‌ పాత్రలో సూర్య రౌద్రంగా, గంభీరంగా కనిపిస్తున్నాడు. ఈ పాత్రలో ప్రేక్షకులను విలన్‌గా కూడా మెప్పించగలనంటున్నాడు సూర్య. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా సూర్య సినిమాలుంటాయి. అవే తమిళంలో సూర్యని సూపర్‌స్టార్‌ని చేసేశాయి. తెలుగు ప్రేక్షకుల్ని సైతం సూర్య ఆకట్టుకుంటున్నాడు. ఇక్కడా స్టార్‌ స్టేటస్‌ ఉంది సూర్యకి. 
మరిన్ని సినిమా కబుర్లు
katrina was angry