Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: కిల్లింగ్‌ వీరప్పన్‌ 
తారాగణం: శివరాజ్‌కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, పారుల్‌ యాదవ్‌, శ్రీధర్‌, సంచారి విజయ్‌, యజ్ఞ శెట్టి తదితరులు 
చాయాగ్రహణం: రామీ 
సంగీతం: రవి శంకర్‌ 
నిర్మాణం: జెడ్‌ 3 పిక్చర్స్‌, జి.ఆర్‌. పిక్చర్స్‌, శ్రీకృష్ణ క్రియేషన్స్‌ 
దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ 
నిర్మాతలు: బి.వి. మంజునాథ్‌, శివప్రకాష్‌, ఇబిఎస్‌ సుధీంద్ర 
విడుదల తేదీ: 7 జనవరి 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ని ఎలా చంపారు? అన్న విషయమే ఈ చిత్ర కథ. అందరికీ తెలిసిన కథే. అయితే ఇది కన్నన్‌ అనే పోలీస్‌ అధికారి కోణంలో వర్మ చెప్పిన కథ. అప్పటిదాకా ఎన్నో ఆపరేషన్లు విఫలమవడంతో, అడవి నుంచి బయటకు తీసుకొచ్చి ఆపరేషన్‌ చేపడితేనే వీరప్పన్‌ని చంపగలమని కన్నన్‌ వ్యూహం రచిస్తాడు. ఈ ప్రయత్నంలో కన్నన్‌ కూడా పలుమార్లు విఫలమవుతాడు. చివరికి కన్ననన్‌, వీరప్పన్‌ని ఎలా తుదముట్టించాడన్నది మిగతా కథ. 

మొత్తంగా చెప్పాలంటే 
వీరప్పన్‌ చనిపోలేదు, బతికే ఉన్నాడని అందరూ అనుకునేలా సందీప్‌ భరద్వాజ్‌ జీవించేశాడు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ కావడంతో సహజమైన నటతో 'వీరప్పన్‌' పాత్రలో సందీప్‌ భరద్వాజ్‌ జీవించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లోజప్‌ షాట్స్‌లో అయినా, లాంగ్‌ షాట్స్‌లో అయినా ఎలా చూసినా వీరప్పనే కన్పిస్తాడు. అంతలా సందీజ్‌ భరద్వాజ్‌ జీవించేయడం గొప్ప విషయం. 

వీరప్పన్‌ని తుదముట్టించాలనే లక్షయంతో రగిలిపోయే పోలీస్‌ అధికారి కన్నన్‌ పాత్రలో శివరాజ్‌కుమార్‌ అద్భుతమైన నటనా ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకుల మనసు దోచేస్తాడు. పారుల్‌ యాదవ్‌ బాగానే చేసింది. వీరప్పన భార్య ముత్తు లక్ష్మి పాత్రలో యజ్ఞ ఓకే. మిగతా పాత్రధారులంతా సినిమాకి అవసరమైన మేర తమ నటనా ప్రతిభతో ఆకట్టుకున్నారు. 

కథ అందరికీ తెల్సినదే. పత్రికల్లో ఎన్నో వార్తా కథనాలు, ఎన్నెన్నో పుస్తకాలూ వచ్చేశాయి వీరప్పన్‌ గురించీ, అతన్ని చంపిన విధానం గురించీ. అయితే తెలిసిన కథను ఇంట్రెస్టింగ్‌గా తీర్చిదిద్దాలంటే గట్స్‌ కావాలి. ఆ గట్స్‌ వర్మకి మెండుగా ఉన్నాయని ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది. ఇలాంటి కాన్సెప్ట్‌ వర్మ మనసుపెట్టి టేకప్‌ చేస్తే ఎలా ఉంటుంది? కథ, కథనం అన్నీ చకచకా నడిచిపోతూనే, ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. సినిమాలో లీనమయ్యేలా చేయగలిగాడు వర్మ. టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌లో అన్నీ వర్మకి పూర్తిగా సహకరించాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌, డైలాగ్స్‌, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్‌ ఒకటేమిటి, అన్నీ అద్భుతంగా కుదిరాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. 

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ గురించి ఆలోచించకూడదు ఇలాంటి సినిమాల్లో. తెలిసిన కథే అయినా క్షణక్షణం ఉత్కంఠ రేపిందంటే అది వర్మ మాయాజాలమే. వర్మ చాన్నాళ్ళ తర్వాత తనదైన ముద్ర చూపించాడని ప్రతి ప్రేక్షకుడూ ఒప్పుకుంటాడు. వర్మ అభిమానులకు ఈ సినిమా పెద్ద ఊరట. అలాగే, వర్మని ఫాలో అవ్వాలనుకునేవారినీ బాగా ఎట్రాక్ట్‌ చేసే సినిమా ఇది. వీరప్పన్‌ బతికి ఉన్న సమయంలో ఎంత హాట్‌ టాపిక్‌ అయ్యాడో, చనిపోయి రోజులు గడిచినా అతని గురించి అంతే హాట్‌గా చర్చ జరుగుతూనే ఉంది. కాబట్టి, ఈ సినిమాని ఒక్కసారైనా చూడాలని చాలామందే అనుకుంటారు. వర్మ నుంచి వచ్చిన, వర్మ మార్క్‌ ప్రాజెక్ట్‌ అన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌కి కలుగుతుంది. ఆ మౌత్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయితే, 'కిల్లింగ్‌ వీరప్పన్‌' సక్సెస్‌ పరంగా ఇంకో లెవల్‌కి వెళుతుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
వర్మ ఈజ్‌ బ్యాక్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
dictator movie release  on sankranti