Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with  nara rohit

ఈ సంచికలో >> సినిమా >>

కన్నడంలో ఎన్టీఆర్‌ సింగింగ్‌ సెన్సేషన్‌

NTR singing sensetion in kannada film industry

హీరోగానే కాదు సింగర్‌గా కూడా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సాధించాడు. తెలుగులో ఇప్పటికే కొన్ని పాటలు పాడాడు. కొన్నాళ్ళ క్రితం వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన 'అదుర్స్‌'లో పాట పాడిన ఎన్టీఆర్‌, తాజాగా 'నాన్నకు ప్రేమతో' సినిమాలో 'ఫాలో ఫాలో ఫాలో ఫాలోయింగ్‌..' అంటూ పాటెత్తుకుని ఫ్యాన్స్‌తో పాటు చిన్న పిల్లలను కూడా తన వెంట ఫాలో అయ్యేలా చేసుకున్నాడు. అయితే తెలుగు వరకూ ఇదంతా బాగానే ఉంది. కానీ మన హీరో ఇంతటితో ఆగలేదు. తన సింగింగ్‌ టాలెంట్‌ను తెలుగుతో పాటు, ఇతర భాషలకు కూడా విస్తరించాలనుకున్నట్టున్నాడు.  కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న 'చక్రవ్యూహ' సినిమాలో పునీత్‌ కోరిక మేరకు ఎన్టీఆర్‌  ఒక పాట పాడాడు. ఈ పాటకి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. యూట్యూబ్‌లో పాటను విడుదల చేసిన కాస్సేపటికే పెద్దయెత్తున లైక్స్‌ షేర్స్‌ వచ్చాయి. తమిళ్‌ హీరో శింబు, తెలుగులో పాటలు పాడటం చూశాం. మనోజ్‌ కోసం ఓ సినిమాలోనూ, ఇంకో సినిమాలోనూ పాటలు పాడిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు హీరో ఇంకో భాషలో పాట పాడటం గొప్ప విషయమే. ఇలా హీరోలు ఒకరికోసం ఒకరు భాషతో సంబంధం లేకుండా తమ స్నేహాన్ని చాటుకుంటూ సెన్సేషన్‌ సృష్టిస్తున్నారు. ఇది నిజంగా సినీ పరిశ్రమ గర్వించదగ్గ విషయమే అని చెప్పాలి. 

మరిన్ని సినిమా కబుర్లు
nara rohit six pack