Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
NTR singing sensetion in kannada film industry

ఈ సంచికలో >> సినిమా >>

తుంటరోడి సిక్స్‌ పాక్‌

nara rohit six pack

కూల్‌ కూల్‌గా కనిపించే ఈ కుర్రాడిలో ఇంత అల్లరి దాగుందా అనుకునేంతగా అల్లరల్లరి చేయనున్నాడట యంగ్‌ హీరో నారా రోహిత్‌. ఇంత వరకూ మెసేజ్‌లిచ్చి, డీసెంట్‌ అండ్‌ క్లాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న నారా రోహిత్‌ ఇకపై మాస్‌ హీరోగా తన స్టైల్‌ మార్చుకోనున్నాడట. ఈ యంగ్‌ హీరో తన నెక్స్‌ సినిమాలన్నింట్లోనూ ఫుల్‌ ఎనర్జీతో కనిపించనున్నాడట. మనోడి చేతిలో ఇప్పటికే ఆరు సినిమాలు ఉన్నాయి. రెస్ట్‌లెస్‌గా నారా రోహిత్‌ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా ఇవి కాక మరో ఐదారు కథలు కూడా రోహిత్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయట. ఇంత వరకూ ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు నారా రోహిత్‌. ఈ నెల్లోనే రెండు సినిమాలు రానున్నాయి. 'తుంటరి', తర్వాత రెండు వారాలకే 'సావిత్రి' సినిమా విడుదల కానుంది. ఇవి కాక 'పండగలా వచ్చాడు', 'రాజా చేయి వేస్తే', 'అప్పట్లో ఒకడుండేవాడు', నీది నాది ఒకే కథ'.. ఇలా ఒకేసారి ఇన్ని సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. అయినప్పటికీ ఏ మాత్రం అలసిపోకుండా కష్టపడుతున్న ఈ యంగ్‌ హీరోకి నిజంగా హ్యాట్సాప్‌. కాస్త బొద్దుగా తయారైన నారా రోహిత్‌ సిక్స్‌ ప్యాక్‌ ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. ఇప్పటికే చేయాల్సి ఉన్నా కొన్ని కారణాలతో చేయలేకపోయానన్నాడు. ఏదేమైనా ఈ ఏడాది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చకచకా విడుదల కాబోయే సినిమాలతో నారా రోహిత్‌కి మంచి బ్రేక్‌ రావాలని ఆశిస్తూ బెస్టాఫ్‌ లక్‌ చెప్పేద్దామా ! 

మరిన్ని సినిమా కబుర్లు
sardar start