Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sardar start

ఈ సంచికలో >> సినిమా >>

'చిత్రాంగద' కోసం అంజలి పాటేస్కుంది

anjali singing in chitrangada movie

పదహారణాల తెలుగమ్మాయి అంజలి నటనతో పాటు తాజాగా తన గొంతు కూడా సవరించుకుంటోంది. ఇప్పటికే హీరోలు, హీరోయిన్స్‌లో చాలా మంది పాటలు పాడటంలో ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. నిత్యామీనన్‌, స్వాతి, రాశి ఖన్నా సహా పలువురు హీరోయిన్లు సింగర్స్‌గా తమ టాలెంట్‌ చూపించుకున్నారు. మొన్నీమధ్యననే ఈ కోవలోకి ముద్దుగుమ్మ త్రిష కూడా చేరింది. తెలుగు అంతగా తెలియని వాళ్లే పాటలు పాడేస్తుంటే, తెలుగులో పుట్టి, తెలుగు వాతావరణంలో పెరిగిన అంజలి భామ ఎందుకు పాడలేదు? ఆ విషయంలో తాను ఏమాత్రం తక్కువ కానంటోంది. అందుకే అంజలి తాను హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న 'చిత్రాంగద' సినిమాలో ఒక పాట పాడేసింది. ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు రెండు భాషల్లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'శంకరాభరణం' సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో నటించి పాత్ర పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 'డిక్టేటర్‌' సినిమాలో బాలయ్య సరసన కనిపించి మెప్పించింది. ఇప్పుడు ఈ కామెడీ థ్రిల్లర్‌ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇలా సినిమా సినిమాకీ వేరియేషన్స్‌ చూపిస్తూ, దాంతోపాటు తనలోని ఎక్స్‌ట్రా టాలెంట్స్‌కి కూడా పదును పెడుతోంది ముద్దుగుమ్మ అంజలి. 

మరిన్ని సినిమా కబుర్లు
tamanna can't without