Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
balayya pair settled

ఈ సంచికలో >> సినిమా >>

అల్లు శిరీష్‌ 'శ్రీరస్తు శుభమస్తు' ముచ్చట

allu sirish act  srirastu shubhamastu movie

పరశురామ్‌ దర్శకత్వంలో ఫుల్‌ టైం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోన్న చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. ఈ సినిమాలో అల్లు వారబ్బాయ్‌ శిరీష్‌ హీరోగా నటిస్తున్నాడు. శిరీష్‌కు జంటగా 'భలే భలే' ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలోని వేల్యూస్‌ని ఈ సినిమాలో డైరెక్టర్‌ చక్కగా చూపించారట. ఇంతవరకూ ఈ తరహా కథలతో అనేక సినిమాలు తెరకెక్కాయి.

కానీ వాటన్నింటిలోకెల్లా ఈ సినిమా విలక్షణంగా ఉండబోతోందట. 'గౌరవం' సినిమాలో నేచురల్‌ లుక్‌లో కనిపించి చాలా సాదా సీదాగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు. 'కొత్త జంట' సినిమాతో లవర్‌ బాయ్‌ గెటప్‌లో ఆకట్టుకున్నాడు. ముచ్చటగా మూడో సారి 'శ్రీరస్తు శుభమస్తు'తో తనలోని నటనకు పదును పెట్టాడు అల్లు శిరీష్‌. పెళ్లి ఒక యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలాంటి మలుపులు తిప్పుతుందో అనే విషయాల్ని ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే చిత్రాల ట్రెండ్‌ నడుస్తోంది. 'సోలో' సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్‌ని చాలా చక్కగా డీల్‌ చేసిన దర్శకుడు పరశురామ్‌, ఈ చిత్రంలోనూ అలా కట్టిపడే సన్నివేశాలతో ప్రేక్షకుల్ని అలరించనున్నాడట. అల్లు శిరీష్‌తో పాటు రావురమేష్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి సీనియర్‌ నటులు నటిస్తున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam