Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chiru 150th movie heroin kajal

ఈ సంచికలో >> సినిమా >>

'అల్లరి పిల్ల' గా రేష్మీ

reshmi so naughty

రేష్మీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీస్‌నే ఎంచుకుంటోంది. అలాంటి కథలే ఆమెను పలకరిస్తున్నాయి. రేష్మీ కేవలం అందాల ఆరబోతతో హీటెక్కిస్తూ, హారర్‌తో భయపెట్టించే పాత్రలకే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది. కానీ ఆమెకు అల్లరి పిల్లలా, బబ్లీగా కనిపించే పాత్రలో నటించాలని ఉందంటోంది. హారర్‌ మూవీస్‌ చేసి చేసి బోర్‌ కొట్టేసిందట. మంచి క్యూట్‌ లవ్‌స్టోరీలో నేటి యువతకు దగ్గరగా ఉండే పాత్రలో నటించాలని ఉందంటోంది. ప్రస్తుతం రేష్మీ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా హారర్‌ మూవీస్‌ కావడం విశేషం. ఇటీవల 'అంతం' అనే సస్పెన్స్‌ మూవీతో మన ముందుకొచ్చింది.

కానీ ఆ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో అన్నట్లుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ నెల 29న రేష్మీ ప్రధాన పాత్రలో నటించిన 'చారుశీల' సినిమా విడుదల కానుంది. కామెడీ ఉన్నప్పటికీ ఇది కూడా థ్రిల్లర్‌ మూవీనే. వచ్చే నెల్లో మరో సినిమా 'రాణిగారి బంగ్లా' విడుదలవుతోంది. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది హాట్‌ హాట్‌ భామ రేష్మీ. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఈ ముద్దుగుమ్మకి ఆశించినంత సక్సెస్‌ని అందివ్వడంలేదుగానీ, రష్మీ పేరు మాత్రం టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. బుల్లి తెరపై అల్లరి పిల్లలా కామెడీ షోతో అలరించిన ఈ బ్యూటీ తెరపైనా 'అల్లరి పిల్ల'లా కనిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ ప్రయత్నాలు సఫలమై, ఆమెకు మంచి హిట్స్‌ దక్కుతాయని ఆశిద్దాం. 

మరిన్ని సినిమా కబుర్లు
mahesh  ready to block buster