Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
balakrishan give dasara gift for fans

ఈ సంచికలో >> సినిమా >>

'ఇజం' విడుదలకు ముస్తాబవుతోంది

ijam movie ready to release

పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కళ్యాణ్‌రామ్‌ సినిమా 'ఇజం'. టైటిల్‌తోనే చాలా క్రేజ్‌ సంపాదించుకున్నాడు కళ్యాణ్‌రామ్‌. అంతేకాదు ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ లుక్స్‌ అదిరిపోయేలా ఉన్నాయి. ఇప్పటికే తన ఫస్ట్‌లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు కళ్యాణ్‌రామ్‌. టీజర్‌ అయితే హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాని తలపిస్తోంది. ఇటీవల 'పటాస్‌'తో సూపర్‌ డూపర్‌ విజయం అందుకున్న కళ్యాణ్‌రామ్‌ మళ్లీ ఈ 'ఇజం' సినిమాతో అంతటి విజయాన్ని అందుకోగలడనీ ఆశిస్తున్నారు అంతా. కళ్యాణ్‌ రామ్‌ స్వీయ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్‌ లుక్స్‌తో పాటు, క్లాస్‌ టచ్‌ ఇచ్చేలా ఉంది కళ్యాణ్‌రామ్‌ గెటప్‌ ఈ సినిమాలో. అంతేకాదు మంచి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ మూవీగా కూడా ఈ సినిమా రూపొందనుందట. కళ్యాణ్‌రామ్‌కీ, పూరీకి కూడా ఈ సినిమా కెరీర్‌ బెస్ట్‌ అనిపించే హిట్‌తోపాటు, విమర్శకుల ప్రశంసల పరంగా కూడా మంచి సినిమా కానుందని భావిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి హీరోలు మంచి దూకుడుమీదున్నారు. తమ్ముడు ఎన్టీయార్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు సక్సెస్‌లతో. ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌ వంతు. 

మరిన్ని సినిమా కబుర్లు
chaitu act kalyan krishna direction