Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ijam movie ready to release

ఈ సంచికలో >> సినిమా >>

చైతూకి మరో సోగ్గాడు

chaitu act kalyan krishna direction

నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించాడు డైరెక్టర్‌ కళ్యాణ్‌కృష్ణ. యంగ్‌ డైరెక్టర్‌ అయినప్పటికీ, సీనియర్‌ నటుడైన నాగార్జునని యంగ్‌ అండ్‌ సీనియర్‌ రోల్స్‌లో చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు కళ్యాణ్‌ కృష్ణ. అందుకే మరో అక్కినేని యంగ్‌ హీరోతో మళ్లీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించబోతున్నాడు. నాగ చైతన్య హీరోగా కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా రాబోతోందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో చైతూ రొమాంటిక్‌ లుక్స్‌ చూసి వావ్‌ అనకుండా ఉండలేరంట. అంత గొప్పగా చైతూ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేయనున్నాడట కళ్యాణ్‌ కృష్ణ. ఈ సినిమాలో చైతూ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయనున్నాడట. ఆల్రెడీ చైతూ హీరోగా తెరకెక్కుతోన్న రెండు సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.

అందులో ఒకటి 'సాహసం శ్వాసగా సాగిపో'. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రం ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందట. ఈ సినిమా ఈ నెల్లోనే విడుదల కానుందని సమాచారమ్‌. మరో లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ప్రేమమ్‌' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ లోగా మరో లవ్‌ స్టోరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు చైతూ. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుందట. ఇటీవల సుశాంత్‌ హీరోగా వచ్చిన 'ఆటాడుకుందాం రా' సినిమాలో చైతూ గెస్ట్‌ రోల్‌లో కనిపించి అలరించాడు. అతి త్వరలోనే లవర్‌ బోయ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
katamarayudu sweet news