Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
katamarayudu sweet news

ఈ సంచికలో >> సినిమా >>

బన్నీ సరసన పూజా హెగ్దే

bunny with pooja hegde

'ముకుంద' సినిమాతో మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్‌ అయిన పూజా హెగ్దేకి మరో మెగా ఛాన్స్‌ దక్కింది. అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిజె - దువ్వాడ జగన్నాథం' చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది పూజా హెగ్దే. ఆల్రెడీ సక్సెస్‌ల పరంగా హాట్రిక్‌ పూర్తి చేసి ఉన్న అల్లు అర్జున్‌ ఈ సినిమాతో మరో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టనున్నాడు. 'రేసుగుర్రం', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి', 'సరైనోడు' సినిమాలతో వరుస హిట్లు కొట్టి జోరు మీదుంది అల్లు అర్జున్‌ కెరీర్‌. తాజాగా 'మొహంజోదారో' సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేక కెరీర్‌ స్లోగా ఉన్న పూజా హెగ్దేకు అల్లు అర్జున్‌తో సక్సెస్‌ కొట్టే అవకాశం ముందుందంటున్నారు.

ఈ సినిమాతో ఇకపై తెలుగులో పూజా ఫుల్‌ బిజీ కానుందని అంచనా వేస్తున్నారు. హరీష్‌ శంకర్‌, అల్లు అర్జున్‌ సినిమా అంటే భారీ అంచనాలున్నాయి. ఇంత భారీ అంచనాల మధ్య వచ్చే సినిమాలో పూజా నటిస్తే ఆమె దశ కూడా తిరిగిపోనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పూజా బన్నీ సినిమాతో మళ్లీ తెలుగులోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వనుందన్న మాట. అంతేకాదు ఈ ముద్దుగుమ్మకి మెగా కాంపౌండ్‌లో మరో సినిమాకీ ఛాన్స్‌ ఉందంటున్నారు. తొలి సినిమా తో సక్సెస్‌ కొట్టిన వరుణ్‌తేజ్‌తో ముద్దుగుమ్మ పూజా మరో సినిమాలో నటించే అవకాశాలున్నాయనీ సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
utteh daughter entry  in flim industry