Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ntr new movie jai lavakusha

ఈ సంచికలో >> సినిమా >>

'ఏంజెల్‌' ఎట్రాక్ట్‌ చేస్తోంది గురూ!

anjel was so attractive

హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలో 'ఏంజెల్‌' అనే సినిమా రూపొందుతోంది. ఇది ఓ సాధారణ యూత్‌ ఫుల్‌ ఫిలిం అని అందరూ అనుకున్నారు. అయితే, అంతకు మించి ఇందులో ఓ విభిన్న కోణం ఉంటుందట. తాజాగా ఈ సినిమా స్టిల్‌ని విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు అమాంతం రెట్టింపయిపోయాయి. సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతోందట. రాజమౌళి శిష్యుడు పళని ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా అద్భుతంగా ఉంటాయట. నాగ అన్వేష్‌ హీరోగా నటిస్తున్నాడు ఈ 'ఏంజెల్‌' చిత్రంలో. దేవకన్య లాంటి అమ్మాయి కోసం ఓ యువకుడు చేసే సాహసాలు అందర్నీ అలరించనున్నాయట. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా గుర్తుకొస్తోంది ఈ సినిమా కథ వింటోంటే. డిఫరెంట్‌ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఏంజెల్‌'లా హెబ్బా పటేల్‌ అందం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుందట.

చిన్న సినిమానే అయినా కానీ నిర్మాత భువన సాగర్‌ ఈ సినిమాని చాలా రిచ్‌గా నిర్మిస్తున్నారు. ఇంతవరకూ ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ బబ్లీ గాళ్‌గా హాట్‌ హాట్‌ అందాలతో అలరించింది. అయితే ఈ సినిమాలో మాత్రం హెబ్బా చాలా కొత్తగా కనిపించబోతోందట. మే నెల రెండో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam