Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

రారండోయ్‌ అంతా సిద్ధమేనండోయ్‌

nagachaitanya  with rakul

అక్కినేని బుల్లోడు నాగ చైతన్య కొత్త సినిమా 'రారండోయ్‌ వేడుక చూద్దాం'. టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ సినిమా నిజంగా వేడుకలానే అనిపిస్తోంది. కళ్యాన్‌ కృష్ణ సినిమాలంటేనే పండగ వాతావరణంలా అనిపిస్తాయి. నిండుగా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా అవుతుంది. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న మూవీనే ఇది. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. చైతూ - రకుల్‌ జంట ఇప్పుడు హాట్‌ న్యూస్‌ అయ్యింది. అంత అందంగా ఉంది ఈ జంట. పోస్టర్స్‌ డిజైన్‌ చేసిన విధానం సూపర్బ్‌. ఇంతవరకూ వచ్చిన స్టిల్స్‌ అన్నీ బెస్ట్‌ స్టిల్సే. ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తున్నాయి. ఇటీవలే ట్రైలర్‌ విడుదలయ్యింది.

ట్రైలర్‌ కూడా చాలా బ్రైట్‌గా ఉంది. ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత చిత్రాల్తో పోలిస్తే నాగ చైతన్య ఈ సినిమాలో చాలా కొత్తగా ప్లెజెంట్‌గా అనిపిస్తున్నాడు. అలాగే రకుల్‌ అప్పియరెన్స్‌ కూడా చాలా బాగుంది. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ మరో ఆకర్షణ ఈ సినిమాకి. టైటిల్‌ సాంగ్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. నిజమేనండి చిత్ర యూనిట్‌ ఆహ్వానిస్తోందనీ కాదు కానీ, ఈ జంటని చూడ్డానికి ఒక్కసారైనా ఈ సినిమా చూడాలండోయ్‌. త్వరలోనే ఈ జంట మన ముందుకు వచ్చేస్తోంది. ఫ్యామిలీతో చూసేందుకు సిద్ధమైపోండి. 
 

Loading...
మరిన్ని సినిమా కబుర్లు
rajinikanth is back