Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

అదరగొట్టబోతున్న ‘రామయ్యా వస్తావయ్యా’

ramayya vastavayya going to be trend setter

‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా టీజర్తోనే సంచలనాలను నమోదు చేసింది. సినిమా విడుదలయ్యాక సంచలనాలెలా వుంటాయోగాని, అభిమానులైతే తమ అభిమాన హీరో సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని, రికార్డులు తిరగరాస్తుందనే ధీమాతో వున్నారు. వారి ధీమాకి కారణం జూనియర్ ఎన్టీఆర్కి దర్శకుడు హరీష్ శంకర్ జతకలవడమే.

‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల రెండో వారంలో విడుదలవుతుంది. ‘జాబిల్లి..’ అంటూ సాగే ఓ పాట బిట్ని ఇటీవలే ఇంకో టీజర్గా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ రెస్పాన్స్ చూసి అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోతోంది.

ఈ సినిమాలోని ‘బుడ్డోడు..’ డైలాగ్ ఆల్రెడీ సినిమాపై వున్న హైప్ని పదింతలు చేసేసిందని వేరే చెప్పక్కర్లేదు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రామయ్యా వస్తావయ్యా’ ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందోగాని, ప్రీ రిలీజ్ సినిమాకి మంచి టాక్ లభిస్తోండటంతో ఓపెనింగ్స్ అదిరిపోతాయనడం నిస్సందేహం.

మరిన్ని సినిమా కబుర్లు
krishnarjuna yuddam with grand father