Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ramayya vastavayya going to be trend setter

ఈ సంచికలో >> సినిమా >>

తాతయ్యతో కృష్ణార్జున యుద్ధం

krishnarjuna yuddam with grand father

హీరో సుమంత్ కెరీర్ కాస్తంత ‘స్లో’ అయ్యింది. ఏదో ఒక సినిమా చేసేద్దాం అన్నట్టు కాకుండా, మంచి సినిమాలు చేయాలన్న ఆలోచనతో సుమంత్ కెరీర్లో వేగం తగ్గించాడు. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాలో నటిస్తున్నాడిప్పుడు సుమంత్. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

అదలా ఉంచితే, సుమంత్ కి ఇప్పుడు కొంచెం ఖాళీ దొరకడంతో, ఆ ఖాళీ సమయాన్ని తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి వినియోగిస్తున్నాడు. తెలుగు సినీ దిగ్గజంగా అక్కినేని గురించి కొత్తగా చెప్పడానికేముంది? అలాంటి దిగ్గజంతో కలిసి, అలనాటి మేటి చిత్రాలను చూస్తూ చాలా విషయాలు తెలుసుకుంటున్నాడట సుమంత్.

సుమంత్, ఏఎన్నార్ ఇటీవలే ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చూశాడట. తాతగారితో కలిసి సినిమాలు చూస్తోంటే, అదో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతోందని, చాలా విషయాలు తెలుసుకుంటున్నాననీ, సినిమా విషయాలే కాక, అన్ని విషయాలపైనా తాతగారు అనర్గళంగా మాట్లాడుతోంటే తనను తాను మైమర్చిపోతున్నానని సుమంత్ అంటున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
amala for hussain sagar