Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

తుఫాన్ - చిత్ర సమీక్ష

Movie Review - Toofan

చిత్రం: తుఫాన్‌
తారాగణం: రామ్‌చరణ్‌, ప్రియాంకా చోప్రా, శ్రీహరి, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ళ భరణి తదితరులు
ఛాయాగ్రహణం: గురురాజ్‌
సంగీతం: అంజన్‌ అంకిత్‌, ఆనంద్‌ రాజ్‌, చిరంతన్‌ భట్‌
నిర్మాణం: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫ్లయింగ్‌ టర్టుల్‌ ఫిలింస్‌, రాంపేజ్‌ మోషన్‌ పిక్చర్స్‌
నిర్మాతలు: పునీత్‌ మెహ్రా, సుమీత్‌ మెహ్రా
దర్శకత్వం: అపూర్వ లాఖియా
విడుదల తేదీ: 6 సెప్టెంబర్‌ 2013

‘రచ్చ’, ‘నాయక్‌’, సినిమాల సక్సెస్‌తో జోరుమీదున్న చరణ్‌ హీరోగా వస్తోన్న సినిమా కావడం, దానికి తోడు బాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తున్న సినిమా కావడంతో, ‘తూఫాన్‌’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్‌లో ‘జంజీర్‌’గా, తెలుగులో ‘తుఫాన్‌’గా విడుదలవుతున్న ఈ సినిమా చరణ్‌కి హ్యాట్రిక్‌ హిట్‌ ఇచ్చిందా? తెలుసుకుందాం పదండిక.

క్లుప్తంగా చెప్పాలంటే:
పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ ఖన్నా (రామ్‌చరణ్‌), ముంబైకి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. అక్కడే మాయ (ప్రియాంకా చోప్రా)తో పరిచయం ఏర్పడుతుంది. ఓ హత్య కేసులో మాయ సాక్షి. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆయిల్‌ మాఫియాతో తలపడ్తాడు విజయ్‌ఖన్నా. ఈ క్రమంలో అతనికి షేర్‌ఖాన్‌ (శ్రీహరి)తో పరిచయం ఏర్పడుతుంది, అది స్నేహంగా బలపడుతుంది. షేర్‌ఖాన్‌తోపాటు, జర్నలిస్ట్‌ జయదేవ్‌ (తనికెళ్ళ భరణి) సహాయంతో ఆయిల్‌ మాఫియాని విజయ్‌ఖన్నా ఎలా అంతమొందిస్తాడు? మాయ ఎలా విజయ్‌ఖన్నాకి దగ్గరయ్యింది? అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే:
పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో రామ్‌చరణ్‌ సత్తా చాటుకున్నాడు. చరణ్‌ నుంచి అభిమానులు ఆశించే అన్ని మాస్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో వున్నాయి. గ్లామరస్‌ పాత్రలో ప్రియాంకా చోప్రా ఒదిగిపోయింది. శ్రీహరి, తనికెళ్ళ భరణి తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విలన్‌గా ప్రకాష్‌రాజ్‌ ఆకట్టుకుంటాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. అందుకే అవలీలగా చేసుకుపోయాడు విలన్‌ పాత్రని ప్రకాష్‌రాజ్‌. మహీ గిల్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. మిగతా తారాగణమంతా వారి వారి తమ పాత్రలకు తగ్గట్టుగా ఫర్వాలేదన్పించారు.

దర్శకుడు అపూర్వ లాఖియా సినిమాలు తీయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ, ఈ సినిమా విషయంలో అంత జాగ్రత్త పడ్డట్లుగా అన్పించదు. సినిమాలో ఫీల్‌ మిస్‌ అయ్యింది. టెక్నీషియన్స్‌ నుంచి కూడా సరిగ్గా ఔట్‌ పుట్‌ రాబట్టుకోలేకపోయాడు. హిందీ / తెలుగు భాషల్లో తెరకెక్కిన సినిమా కావడంతో నేటివిటీ కాస్తంత ఇబ్బంది పెట్టింది. డబ్బింగ్‌ సినిమా చూస్తున్నట్టే అన్పిస్తుంది.

రీ-రికార్డింగ్‌, ఎడిటింగ్‌ విభాగాలు బెటర్‌గా వుంటే, సినిమాకి ఇంకా బెటర్‌ రిజల్ట్‌ వచ్చి వుండేది. స్క్రీన్‌ప్లేలో జర్క్స్‌ వున్నాయి.  అమితాబ్‌ని యాంగ్రీ యంగ్‌మెన్‌ని చేసిన సినిమా అయినప్పటికీ, ఇప్పటి నేటివిటీకి తగ్గట్టు రీమేక్‌ చేయడం అంటే చిన్న విషయమేమీ కాదు. అది ఓ సాహసం. ఆ సాహసం చేయడంలో అపూర్వ లాఖియా అంత సక్సెస్‌ కాలేకపోయాడు. తెలుగు వెర్షన్‌ కోసం ప్రత్యేకంగా కొంత టీమ్‌ పనిచేసినా, ‘తెలుగుదనం’ కొరవడింది. టెక్నికల్‌గా బాగుంది అని చెప్పాలంటే, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మాత్రమే.

మాటల్లో చెప్పాలంటే: ఈ తుఫాన్‌ అంచనాలకు తగ్గట్టుగా బలపడలేదు.

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Singers - Sravanthi, Prasanthi, Deepthi