Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

30-06-2017 నుండి 06-07-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తం మీద మిత్రులతో అధిక సమయం వెచ్చించే అవకాశం ఉంది. వారితో కలిసి ముఖ్యమైన పనులకు సమయం ఇస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం ఉపయోగపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో పనులు కొద్దిగా వేగవంతం అయ్యే అవకాశం ఉంది. మీ మాటతీరు మీకు సహాయకారిగా పనిచేస్తుంది. మాటతో పనులు చేయించుకుంటారు. స్వల్పదూర ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకొనే వారు వారై పనులను పూర్తిచేస్తారు. సంతానం విషయంలో ఆరంభంలో ఒకింత ఆందోళనకు లోనయిన ఫలితాలు అనుకూలంగానే వస్తాయి. 

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద నూతన పనులను మొదలు పెట్టాలనే ఆలోచన కలిగి ఉంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో మాత్రం ఒత్తిడి ఉంటుంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన పెటుబడులకు అవకాశం కలదు. విలువైన వస్తువులను మిత్రులద్వారా పొందుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. విదేశీప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. 

 

.
మిథున రాశి : ఈవారం మొత్తం మీద ఆలోచనలు పెరుగుటకు  ఆస్కారం ఉంది, మానసికంగా ఒత్తిడిని కలిగి ఉంటారు. చేపట్టిన పనులను వారం చివరలో పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దల అభిప్రాయాలను అలాగే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో ఊహించని విధంగా మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం ఉంది. సోదరులతో చర్చలకు అవకాశం ఇవ్వకండి. సర్దుబాటువిధానం అన్నివిధాలా సహాయపడుతుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ కూడదు, జాగ్రత్తలు తీసుకోండి.  

 

 


కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద పెద్దలతో సమయాన్ని గడుపుతారు, మిత్రులతో సమయం సరదాగా గడుపుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సోదరులతో చేపట్టిన చర్చలు ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. తండ్రితరుపు బంధువులలో ఒకరో ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. 

  

 



 సింహ రాశి :  ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. పెద్దలతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను వారం మధ్యలో చేపట్టుట వలన పనులు వేగంగా పూర్తిఅవుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో కీలకమైన చర్చలకు అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. జీవితభాగస్వామితో విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది, కావున నిదానంగా వ్యవహరించుట సూచన. చర్చల్లో నిదానం అవసరం. 

 

 

కన్యా రాశి :  ఈవారం మొత్తం మీద చేపట్టు పనుల విషయంలో ఎంత స్పష్టత ఉంటె అంత లబ్దిని పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి వస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి సహకారం లభిస్తుంది, నూతన విషయాలు తెలుస్తాయి. మధ్యవర్తిత్వం చేసే విషయంలో కాస్త నిదానం అవసరం. స్త్రీ పరమైన విషయాల్లో బాగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. చర్చల్లో పాల్గొంటారు. 

 

 

తులా రాశి : ఈవారం మొత్తం మీద మానసికంగా ఒత్తిడిని కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. నిర్ణయాల్లో స్పష్టత ఉండే అవకాశం లేదు. నూతన సమస్యలకు ఆస్కారము ఉంది , జాగ్రత్త. ఆరోగ్యపరమైన విషయాల్లో మీ ఆలోచనలు వ్యతిరేక దిశలో ప్రయాణం చేసే అవకాశం ఉంది, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది,సాధ్యమైనంత వరకు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. మీ మాటతీరు మూలాన ఆత్మీయులను కోల్పోయే ప్రమాదం కలదు, జాగ్రత్త. సర్దుబాటు విధానం సర్వదా మంచిది , గుర్తించుకోండి. 

 

   

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద నూతన పనులను మొదలు పెట్టుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. బంధువులను కలుస్తారు,వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈవారంలో శుభకార్యాల గురుంచి నిర్ణయం తీసుకుంటారు. విదేశీప్రయాణాలు చేయవల్సి వస్తుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. గతంలో మీకున్న ఆరోగ్యసమస్యలు కాస్త తగ్గుముఖం పడుతాయి. కుటుంబపరమైన విషయాల్లో కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది, అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోండి.  

 

 

ధనస్సు రాశి :   ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. జీవితభాగస్వామి నుండి ఒత్తిడి పెరుగుటకు అవకాశం ఉంది, వారితో మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తలు తీసుకోవడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలు పెద్దలను ఆకట్టుకుంటాయి. సోదరులతో చేసిన చర్చలు ఒక కొలిక్కి రాకపోవచ్చును. విలువైన వస్తువుల విషయంలో ఏమరుపాటు వద్దు. 

 

మకర రాశి :  ఈవారం మొత్తం మీద సమయాన్ని చర్చలకు ఇవ్వకండి, వృధా అయ్యే అవకాశం ఉంది. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగపడుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. ఉద్యోగంలో పనిఒత్తడి ఉంటుంది , అధికారుల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళండి. ఎవ్వరితో మాటపట్టింపులకు వెళ్ళకండి. మీ మాట తీరు మీ మిత్రులకు , ఆత్మీయులకు నచ్చకపోవచ్చును. విదేశాల్లో ఉన్న పెద్దలతో నూతన సంప్రదింపులు చేస్తారు. 

 

   కుంభ రాశి :  ఈవారం మొత్తం మీద ఆరంభంలో ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. సమయం విలువ తెలుసుకొని ముందుకు వెళ్ళుట మంచిది. సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వానికి , చర్చలకు దూరంగా ఉండుట సూచన. రావాల్సిన ధనం చేతికి అందకపోవచ్చును. ఉద్యోగంలో గతంలో చేపట్టిన పనులు కలిసి వస్తాయి. మీ మాటతీరును సరిచూసుకోండి. జీవిత భాగస్వామి మూలాన ఆత్మేయులను కోల్పోయే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్దగా ఉన్న చెడ్డ పేరువచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. 

 

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద సోదరులతో లేదా పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనలు నూతన అవకాశాలను సృష్టిస్తాయి. మిత్రులతో కలిసి చేసిన పనులు లబ్దిని కలిగిస్తాయి. సాధ్యమైనంతవరకు ఎవరితో మాటపట్టింపులకు వెళ్ళకండి. వివాదాలకు దూరంగా ఉండుట సూచన. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేస్తారు.  

మరిన్ని శీర్షికలు
uttarakhand tourism