Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
puri balayya paisa vasool special

ఈ సంచికలో >> సినిమా >>

'జై లవకుశ' ఎన్టీయార్‌కి 3 సినిమాల కష్టం

jai lavvakusha dubbing start

నందమూరి కళ్యాణ్‌రామ్‌, ఎన్టీయార్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ దర్శకత్వంలో నిర్మిస్తోన్న 'జై లవకుశ' సినిమా డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'జై లవ కుశ' సినిమాలో ఎన్టీయార్‌ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసినదే కదా. అందుకే మూడు పాత్రలకీ మూడు రకాల డిక్షన్‌తో డబ్బింగ్‌ చెప్పవలసి ఉంటుంది. ఏ పాత్రకి ఆ పాత్రే అన్నట్లుగా డబ్బింగ్‌ చెప్పేందుకోసం ఎన్టీయార్‌ ఓ పాత్ర తర్వాత మరో పాత్రకి డబ్బింగ్‌ చెబుతున్నాడట. జై పాత్రకి వాయిస్‌ కాస్త నత్తితో కూడినట్లుగా ఉంటుంది.

అది నెగెటివ్‌ షేడ్స్‌తో కూడిన పాత్ర కావడంతో ఎగ్రెసివ్‌గా ఉంటూనే, ఓ ప్రత్యేకమైన మాడ్యులేషన్‌ దానికోసం చూపిస్తున్నాడట ఎన్టీయార్‌. అలాగే లవ, కుశ పాత్రలకి కూడా విభిన్నమైన మాడ్యులేషన్స్‌ని ఇప్పటికే ఎన్టీయార్‌ ప్రిపేర్‌ చేసుకున్నట్లు తెలియవస్తోంది. అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న సినిమా కావడంతో, ఇది పూర్తిగా ఎన్టీయార్‌ సొంత సినిమా అనే భావించవలసి ఉంటుంది. అందుకేనేమో ఎన్టీయార్‌ ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఎన్టీయార్‌ ఏ సినిమా చేసినా ఆ సినిమా కోసం ఇంతలానే కష్టపడతాడని ఆయనతో ఇంతకు ముందు సినిమాలు చేసిన దర్శక నిర్మాతలు అంటున్నారు. అయినప్పటికీ, త్రిపాత్రాభినయం అంటే మాటలు కాదు. అందుకే మూడు సినిమాల కోసం పడే కష్టం, నటుడిగా ఒక్క సినిమాతోనే పడుతున్నాడు ఎన్టీయార్‌. ఆ కష్టానికి దక్కే ఫలితం కూడా అలాగే ఉంటుందని వేరే చెప్పాలా!

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam