Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
akhil with two heroins

ఈ సంచికలో >> సినిమా >>

ఆ స్టామినా పవన్‌ కళ్యాణ్‌ సొంతం

pavan tri,vikram combination movieshooting start

పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే నైజాం రైట్స్‌ కనీ వినీ ఎరుగని స్థాయిలో అమ్ముడుపోయాయ్‌. టైటిల్‌ కూడా ఇంకా కన్‌ఫామ్‌ కాలేదు. సినిమాకి సంబంధించిన ఏ డీటెయిల్‌ తెలీదు. కానీ బిజినెస్‌ ఈ రేంజ్‌లో జరుగుతోంది. పవన్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కున్న క్రేజ్‌ అలాంటిది. ఆ మాటకొస్తే పవన్‌ ఏ సినిమాకి అయినా ఇదే స్థాయిలో ప్రీ బిజినెస్‌ జరుగుతుంది. సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో అస్సలు సంబంధమే లేదు పవన్‌ సినిమాలకి. ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ రికార్డులే. 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకి ముందే లీక్‌ అయిపోయింది.

అయినా కానీ ఆ సినిమా సాధించిన వసూళ్లు ఎప్పటికీ ట్రాక్‌ రికార్డులే. అదీ పవన్‌ స్టామినా అంటే. 2018 జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌నందిస్తున్నాడు. త్రివిక్రమ్‌ సారధ్యంలో అనిరుధ్‌ మ్యూజిక్‌తో వచ్చిన పాట క్లిప్పింగ్‌ ఇప్పటికే ట్రెండింగ్‌ అయిపోయింది. ఈ పాట వచ్చినాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయ్‌. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పలు టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. దసరాకి సినిమాకి సంబంధించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ తెలియనుందనీ సమాచారమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
mehereen beauty at her best