Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pavan tri,vikram combination movieshooting start

ఈ సంచికలో >> సినిమా >>

మెహరీన్‌ - బ్యూటీ ఎట్‌ హెర్‌ బెస్ట్‌

mehereen beauty at her best

గతేడాది 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది క్యూట్‌ బ్యూటీ మెహరీన్‌ కౌర్‌. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే విజయం అందుకుంది. లక్కీ గాళ్‌ అనిపించుకుంది. ఆ సినిమాలో అమ్మడి పర్‌ఫామెన్స్‌కి వరుసగా ఆఫర్లు క్యూ కడతాయని భావించారంతా. కానీ ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఈ ముద్దుగుమ్మ లిస్టులో సినిమాల్లేవనీ కాదు. చాప కింద నీరులా దూసుకొచ్చేస్తోంది. ఎప్పుడు సైన్‌ చేసిందో, ఎప్పుడు సెట్స్‌ మీదికెళ్లాయో తెలీదు. కానీ వరుస పెట్టి ఈ భామ నటించిన సినిమాలు ఇప్పుడు విడులకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల్లోనే శర్వానంద్‌తో 'మహానుభావుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోందీ సినిమా. తర్వాత రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్‌' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అది కూడా త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఇవి కాక మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో 'జవాన్‌'లో నటిస్తోంది మెహరీన్‌. అంతేకాదు తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. సందీప్‌ కిషన్‌తో జత కడుతోంది ఆ సినిమాలో. ఇలా క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇలా చేతి నిండా పని ఉండడమే తనకి ఎంతో ఇష్టమనీ, ఖాళీగా ఉండడం అంటే అస్సలు ఇష్టముండదనీ అంటోంది ముద్దుగుమ్మ మెహరీన్‌. అలాగే తెలుగమ్మాయిలా తనకెంతో ఆదరణ దక్కుతోందంటూ, మురిసిపోతోంది. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, మరో పక్క ఇంకో సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొనాల్సి వస్తోందని అంటోంది ఈ బిజీ గాళ్‌ మెహరీన్‌ కౌర్‌.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondchooddam