Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

'పద్మావత్‌'గా వచ్చేస్తోందిగానీ..

'Padmavat' is coming ..

'పద్మావతి' టైటిల్‌తో తెరకెక్కిన సినిమా ఇప్పుడు 'పద్మావత్‌' అని పేరు మార్చుకుంది. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'పద్మావత్‌'. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే సినిమా మొదలైన నాటి నుండీ చుట్టుముట్టిన వివాదాల సంగతి అందరికీ తెలిసిందే. ఆఖరికి సినిమా విడుదల నిలిపివేసేదాకా ఈ వివాదాలు ఆగలేదు. సెన్సార్‌ కాకుండానే సినిమా ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు ప్రత్యేక సమీక్షా బృందం ఆధ్వర్యంలో సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌నిచ్చింది. అయితే టైటిల్‌ మాత్రం మారిపోయింది. అలాగే యదార్ధ గాధ అనే విషయాన్ని పక్కన పెట్టి, ఇదో కల్పిత గాధ అని సినిమాని విడుదల చేయాలని సెన్సార్‌ బోర్డ్‌ చిత్ర యూనిట్‌కి ఆంక్షలు విధించింది. ఇలా కొన్ని కత్తెరలు, మరికొన్ని ఆంక్షల నడుమ మొత్తానికి ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ అందుకుని విడుదలకు సిద్ధమైంది. డిశంబర్‌ 1న విడుదల కావాల్సిన 'పద్మావత్‌' జనవరి 25న విడుదలకు ముస్తాబవుతోంది.

ఇక సినిమా విషయానికి వస్తే, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'పద్మావత్‌'. ఈ సినిమాలో దీపికా పదుకొనె తన పాత్ర కోసం చాలా కష్టపడింది. ఛాలెంజింగ్‌ పాత్రలు దీపికాకు కొత్తేమీ కాదు. కానీ ఈ సినిమా కోసం దీపికా పడిన కష్టం అంతా తెరపై కనిపిస్తుందట. దీపికకు ఈ సినిమా అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం. షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ఇతర ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు ఈ సినిమాలో. చిత్రం విడుదల డేట్‌ కన్‌ఫామ్‌ అయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌ కనీ వినీ ఎరుగని స్థాయిలో రెస్పాన్స్‌ అందుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఇన్ని వివాదాల నుండి గట్టెక్కి ఎట్టకేలకు ధియేటర్స్‌లో సందడి చేయనున్న 'పద్మావత్‌' రిజల్ట్‌ ఎలా ఉండబోతోందో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
The trailer was also manasuku nacchindi