Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

రాజావారు రాణిగారూ' ఎక్కుడో టచ్‌ చేస్తున్నారూ.!

What a touch!

ఇది ఓ సినిమా పేరండీ. పేరుకు చిన్న సినిమానే కానీ, పెద్దగా టచ్‌ చేస్తోంది. చూస్తున్నారుగా.. టైటిల్‌ పెద్దగా పెట్టారు. టైటిల్‌కి తగ్గట్లుగానే ఇంపాక్ట్‌ కూడా పెద్దగానే చూపిస్తోంది. ఇంతకీ సినిమా కథా కమామిషు ఏంటంటే, అదో పల్లెటూరు. ఆ ఊరిలో ఓ కుర్రోడు, కుర్రది. ఆ కుర్రోడికి ఇద్దరు ఫ్రెండ్స్‌. అలా ఓ నలుగురు టీనేజర్స్‌ అన్నమాట. వారి వారి తండ్రులు ఊళ్లో రకరకాల పొజిషన్స్‌లో ఉంటారు. ఆకతాయిగా తిరిగే ఈ కుర్రాళ్ల కారణంగా వారి తండ్రులకు బ్యాడ్‌ నేమ్‌ వస్తుందేమో అని ఎప్పటికప్పుడే మందలిస్తూ ఉంటారు. కుర్రోడు, కుర్రది అని చెప్పాం కదా.. వారిద్దరి మధ్యా లవ్‌ మామూలే కదా.. అయితే, కంటెంట్‌లో పెద్దగా కొత్తదనమేమీ లేకున్నా, టేకింగ్‌ మాత్రం కొత్తగానే కనిపిస్తోంది. ఈ మధ్య కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి పెద్ద హిట్‌ అయిపోతున్నాయి .

అలా అని అన్ని చిన్న సినిమాలూ హిట్‌ అవుతున్నాయని చెప్పలేం కానీ, ఓ పాతికో ముప్పై సినిమాలో వస్తుంటే, అందులో ఒకటి క్లిక్‌ అవుతోంది. ఆ కోవలో ఈ 'రాజావారు రాణిగారు' సినిమాకి హిట్‌ కళ కనిపిస్తోంది. టైటిల్‌ దగ్గర నుండి, టీజర్‌ వరకూ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. ఒక కూల్‌ ఎంటర్‌టైనర్‌ని చూస్తున్నామన్న ఫీల్‌ కలిగిస్తోంది. దాంతో ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమా పట్ల ఆకర్షితుడవుతున్నాడనీ తెలుస్తోంది. ఈ మధ్య సురేష్‌ ప్రొడక్షన్స్‌, అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌, వారాహి ప్రొడక్షన్స్‌ వంటి ప్రముఖ బ్యానర్లు ఈ తరహా చిత్రాలను ప్రోత్సహిస్తూ తమ వంతు సపోర్ట్‌ అందిస్తున్నాయి. డైరెక్టర్‌, నటీనటులు, ప్రొడక్షన్‌ హౌస్‌.. ఇలా ఏమీ పెద్దగా పరిచయం లేని ఎలిమెంట్సే.. సో పేరున్న ప్రొడక్షన్‌ సంస్థ చేయందిస్తే, ఈ సినిమాకి ఖచ్చితంగా అది ప్లస్‌ అవుతుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
That's the headache