Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

రొయ్యల బిర్యానీ - పి . శ్రీనివాసు

కావలసిన పదార్థాలు:
రొయ్యలు, పలావు దినుసులు, పచ్చి మిర్చి, కొద్దిగా జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్.


తయారు చేయు విధానం:
ముందుగా గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడిచేయాలి. తరువాత దానిలో పలావు దినుసులు, పచ్చిమిర్చి, జీలకర్ర వేయాలి. దాని తరువాత కడిగిన రొయ్యలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ దానిలో వేసి కొంచెం అటు ఇటు తిప్పాలి. అవి కొంచెం మగ్గిన తరువాత దానిలో 3 గ్లాసుల బాస్మతి రైస్ వేసి, దానికి 4 1/2 గ్లాసుల నీళ్ళు వేసి, తరువాత దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి కలిపిన తరువాత ఉప్పు సరిపోతుందో లేదో చూసుకోవాలి. తరువాత దీనిని రైస్ కుక్కర్ మీద పెట్టి ఉడికించాలి. కొంచెం సేపు తరువాత తీసి చూస్తే రొయ్యల బిర్యాని రెడీ. దీనిని ఉల్లి చట్నీతో కలుపుకుని చక్కగా తినవచ్చు.
 

మరిన్ని శీర్షికలు
idont want dowry