Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

రాజుగారి గది 3 చిత్రసమీక్ష

rajugari gadi 3 movie review

చిత్రం: రాజుగారి గది 3
నటీనటులు: అశ్విన్‌ బాబు, అవికా గోర్‌, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, హరితేజ, అజయ్‌ ఘోష్‌, ఊర్వశి తదితరులు
సంగీతం: షబీర్‌
నిర్మాణం: ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దర్శకత్వం: ఓంకార్‌
నిర్మాత: ఓంకార్‌
విడుదల తేదీ: 18 అక్టోబర్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

వృత్తి రీత్యా డాక్టర్‌ అయిన మాయ (అవికా గోర్‌)ని ఎవరైనా తాకాలని ప్రయత్నిస్తే ఇక అంతే సంగతులు. ఓ ఆత్మ ఆమెకు కవచంలా వుంటుంది. అశ్విన్‌ (అశ్విన్‌ బాబు) అనుకోని పరిస్థితుల్లో మాయని ప్రేమిస్తాడు. మరి, అవిక చుట్టూ తిరుగుతోన్న ఆత్మ అశ్విన్‌ని ఏం చేస్తుంది.? ఆ ఆత్మ ఎవరు.? ఆ ఆత్మ నుంచి మాయని విముక్తిరాలిని చేసేందుకు అశ్విన్‌ చేసే ప్రయత్నాలు ఎలాంటివి.? అసలు మాయ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే..

గత సినిమాలతో పోల్చితే అశ్విన్‌ కాస్త బెటర్‌ అనిపిస్తాడు. డాన్సులు బాగానే చేశాడు. ఇంకా నటుడిగా పరిణతి సాధించాలి. అవికా గోర్‌కి పెద్దగా నటించేందుకు స్కోప్‌ దొరకలేదు. చివర్లో దెయ్యంగా కన్పిస్తుందామె. కొంచెం బొద్దుగా కన్పించినా, అందంగా వుంది అవికా గోర్‌. అలీ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కన్పించాడు. కాస్సేపు నవ్వులు పూయించాడు. ధన్‌ రాజ్‌, ప్రభాస్‌ శ్రీను, బ్రహ్మాజీ, హరితేజ, శివ శంకర్‌ మాస్టర్‌.. ఇలా కామెడీ గణం బాగానే వుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఓకే అన్పిస్తారు.

ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో కథ తయారు చేయడం వరకూ బాగానే వున్నా, కథనం ఆకట్టుకునేలా మలచలేకపోయాడు దర్శకుడు. మాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. నిర్మాణపు విలువలు బావున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ తమ పరిధి మేర చెప్పుకోదగ్గ ఔట్‌ పుట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాయి.

'రాజు గారి గది'ని కామెడీతోపాటు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించడంలో రెండో గదికి వచ్చేసరికి దారి తప్పాడు. మూడో గదికి మళ్ళీ పాత ఫార్ములా కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నాడు. కామెడీ కొంతమేర బాగానే అన్పించినా, ఈసారి కథకు ఆ కామెడీ అడ్డు తగిలింది. హీరోయిన్‌కి నటించేందుకు పెద్దగా స్కోప్‌ ఇవ్వలేదు. ఆసక్తికరమైన కథని, పేలవమైన కథనంతో నీరుగార్చేసినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో చాలా భాగం పస లేకుండా సాగుతుంది. ఆ పార్ట్‌ మీద మరింత ఫోకస్‌ పెట్టి వుంటే బావుండేది. సెకెండాఫ్‌లో కాస్త బెటర్‌ అన్పించినా, అక్కడక్కడా స్లో నెరేషన్‌, అనసవరపు సన్నివేశాలు సినిమా గమనానికి అడ్డుపడ్తాయి. ఓవరాల్‌గా చూస్తే, బెటర్‌ ప్రాజెక్ట్‌ అవదగ్గ అవకాశాలున్నా.. దర్శకుడు దారి తప్పడంతో ఫలితం ఆశించిన మేర దక్కడం కష్టం.

అంకెల్లో చెప్పాలంటే..
2.5/5

ఒక్క మాటలో చెప్పాలంటే..
మొదటి గదికీ రెండో గదికీ మధ్యలో!

మరిన్ని సినిమా కబుర్లు
churaka