Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

సైరా' జోరు తగ్గింది కానీ.!

Saira has decreased but.!

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం పోజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా నిర్మాతలకు మంచి విజయం అందించింది. అయితే, కమర్షియల్‌ అంశాలకు దూరంగా ఉన్న చిత్రం కనుక వసూళ్లు నిలకడగా ఉన్నాయి. రావాల్సిన లాభాలయితే వచ్చేశాయనుకోండి. ప్రస్తుతానికి షేర్‌ గణనీయంగా తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 102 కోట్లు షేర్‌ సాధించింది. మొత్తంగా 150 కోట్లు షేర్‌ సాధించొచ్చని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 'సైరా' తర్వాత చెప్పుకోదగ్గ స్థాయి సినిమా విడుదల కాకపోవడంతో ఈ సినిమాకి వసూళ్ల పంట పండుతోందనే చెప్పాలి. బాలీవుడ్‌లో ఇదే సినిమాతో 'వార్‌' రిలీజ్‌ కావడంతో అక్కడ వసూళ్లకు దెబ్బ పడింది. అయితే, ప్రస్తుతం 'వార్‌' హవా కాస్త తగ్గడంతో 'సైరా' పుంజుకుంటోంది.

తెలంగాణాలో దసరా సెలవుల పెంపు, 'సైరా'కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మళ్లీ వీకెండ్‌ వస్తోంది. ఈ వీక్‌ కూడా చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. సో 'సైరా' మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొట్ట మొదటి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మించారు. తమన్నా, నయనతార కథానాయికలుగా నటించారు.

మరిన్ని సినిమా కబుర్లు
Is Rumors True