Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Is Rumors True

ఈ సంచికలో >> సినిమా >>

డైరెక్టర్‌ తేజ ఎవర్ని టార్గెట్‌ చేశాడబ్బా.!

Director Teja Ever targeted!

'ఊరకే ఎవరూ మెగాస్టార్లు కాలేరు..' అంటూ డైరెక్టర్‌ తేజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. క్యారవాన్‌లో ఉండేవాడు హీరో కాదు.. సెట్‌లో ఉండి మిగిలిన నటీనటుల నటనను కూడా గమనించేవాడే అసలు సిసలు హీరో. అసలు సిసలు మెగాస్టార్‌. చిరంజీవి అటువంటి హీరోనే. అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యారు.. అంటూ తేజ వ్యాఖ్యానించారు. తేజ టార్గెట్‌ ఎవరికో.. అనే సంగతి పక్కన పెడితే, కొంతమందిని పొగడాలంటే మాటలు వెతుక్కోవాలి. కానీ, కొందరిని పొగిడేందుకు మనసుంటే చాలు. అలా తేజ మనసులోంచి వచ్చినవే ఈ ఆణిముత్యాలు. 'సైరా' హిట్‌తో చిరంజీవి గురించి ఓ మంచి మాట చెప్పడాన్ని తమ గౌరవంగా భావిస్తున్నారు ప్రతీ ఒక్కరూ. 150 సినిమాలు చేసిన ఆయన అనుభవాన్ని గుర్తు చేసుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నారు.

రెండు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీని ఏలి, రాజకీయాల కారణంగా తొమ్మిదేళ్లు గ్యాప్‌ తీసుకున్నా, రీ ఎంట్రీలో మళ్లీ తానే ఇండస్ట్రీ కింగ్‌ బాక్సాఫీస్‌ రారాజు.. అని నిరూపించాడు. కేవలం వసూళ్లే కాదు, 'సైరా నరసింహారెడ్డి' వంటి ఓ మరుగుపడిపోయిన చరిత్రని దేశానికి కాదు, ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేసి, సక్సెస్‌ అయ్యాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. అందుకే ఆయన మెగాస్టార్‌.. ఈ మాట తేజనే కాదు, ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. డైరెక్టర్‌ కాకముందు, దగ్గర నుండి చిరంజీవిని చూసిన ఓ వ్యక్తిగా ఆయన గురించి ఇప్పుడు ఇలా మాట్లాడుకోవడం చాలా చాలా గర్వంగా ఉందని తేజ చెప్పుకొచ్చారు. అయితే, తేజ ఇంకెవర్నో టార్గెట్‌ చేసిన మాట కూడా వాస్తవమే. అయితే, ఇప్పుడది ఎందుకులెండి.

మరిన్ని సినిమా కబుర్లు
what happened!