Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope november 29th to december 5th

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటి ఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ వారం ( 29/11 – 5/12 )  మహానుభావులు.

జయంతులు

నవంబర్ 30

శ్రీ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు : “ వడ్డెర చండీ దాస్ “ గా ప్రసిధ్ధులు. వీరు నవంబర్ 30, 1937 న  పెరిశేపల్లి లో జన్మించారు. ప్రసిధ్ధ తెలుగు నవలా రచయిత… “ హిమజ్వాల “ నవలతో , తెలుగు పాఠకుల మనసు దోచుకున్నారు.“ అనుక్షణికం “ మరో అద్భుత నవల.

డిశంబర్  1

శ్రీ నార్ల వెంకటేశ్వర రావు :  వీరు డిశంబర్ 1 , 1908 న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించారు. తెలుగునాట ప్రముఖ  పాత్రికేయులు, రచయిత. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాది గా, మానవతావాదిగా జీవించారు.

డిశంబర్ 2 

శ్రీ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి :  వీరు డిశంబర్ 2, 1912 న  పొట్టిపాడు లో జన్మించారు. “ నాగిరెడ్డి “ గా ప్రసిధ్ధులు. శ్రీ చక్రపాణి గారితో కలిసి  “ విజయా ప్రొడక్షన్స్ “ పేరిట ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. పిల్లల మాసపత్రిక “ చందమామ “ ను ప్రారంభించింది  వీరే.  అలాగే “ ఆంధ్రజ్యోతి “ కూడా ప్రారంభించారు. భారత ప్రభుత్వం వీరిని “ దాదా సాహెబ్ ఫాల్కే “  ఎవార్డ్ తో సత్కరించింది.

డిశంబర్ 4

శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ  : వీరు డిశంబర్ 4 , 1877 న సత్తెనపల్లి లో జన్మించారు.  గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్య యోధుడు గా,  తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం.. శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు :  వీరు డిశంబర్ 4 , 1922 న చౌటుపల్లి లో జన్మించారు. ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు.  తెలుగు సినిమా తొలితరము నేపథ్యగాయకులలో ప్రముఖుడు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు వారిలో అత్యంత ప్రజాదరణ పొందినది.  ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏనోట విన్నా ఆయన పాడిన పాటలే..

డిశంబర్ 5

స్వామి జ్ఞానానంద :  వీరి పూర్వాశ్రమ పేరు..భూపతిరాజు లక్ష్మీనరసింహ రాజు. వీరు డిశంబర్ 5, 1896 న గోరనగమూడి లో  జన్మించారు ప్రముఖ యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త.  1954 నుండి పదేళ్ళు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు భౌతిక విజ్ఞాన విభాగంలో ఆచార్యులు గా , శాఖాధ్యక్షులుగా వెలుగొంది వాటికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు. .

వర్ధంతులు

నవంబర్ 30

1.శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు :  సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. వీరు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచారు. వీరు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించారు. వీరి అద్భుత మేధాశక్తి  ఎన్నో కళలను గ్రహించింది. వీరికి ఆయుర్వేదం లో కూడా ప్రవేశముండేది. జ్యోతిశ్శాస్త్రము, అభినయ శాస్త్రములలో కూడా ఉద్దండులు. వీరు నవంబర్ 30 , 1912 న స్వర్గస్థులయారు. శ్రీ గురజాడ అప్పారావు : వీరిని కానీ, “ కన్యాశుల్కం “ నాటకాన్ని కానీ, ఏ తెలుగు పాఠకుడూ మర్చిపోలేరని చెప్పడం అతిశయోక్తి కాదు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. వీరు నవంబర్ 30, 1915 న స్వర్గస్థులయారు.

శ్రీ యేల్చూరి విజయరాఘవ రావు :  ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత.[1].ఆయన అత్యంత ప్రతిభావంతుడు. సంగీత లోకంలో చాలా గొప్పవాడు.  ఖండాంతర ఖ్యాతినార్జించినవాడు. ప్రపంచంలోని ఐదు ఖండాలలో మూడు ఖండాలలో ఒకసారి కాదు ఎన్నోసార్లు ఆయన సంగీత కచేరీలు నిర్వహించారు.. శ్రోతల నుంచి బహుళ విశేష ప్రశం సలు పొందారు. వీరు  నవంబర్ 30, 2011 న స్వర్గస్థులయారు.

డిశంబర్ 3

శ్రీ బందా కనకలింగేశ్వర రావు :  సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు ఈయన తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం సినిమాలైన బాల నాగమ్మ, ద్రౌపదీ మానసంరక్షణం, పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా), సారంగధర (1937 సినిమా) సినిమాలలో నటించాడు. వీరు కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవచేశారు. వీరు డిశంబర్ 3, 1968 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
why