Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
express movies

ఈ సంచికలో >> సినిమా >>

ఉదయ్‌కిరణ్‌కి నివాళి

Tribute to Uday Kiran
‘చిత్రం’గా తెలుగు తెరపైకొచ్చాడు. ఏదో ఒక్క సినిమా వండర్‌, అతను హీరో ఏంటి? అనుకున్నారు కొందరు. కానీ ‘నువ్వునేను’ సినిమాతో హిట్‌ కొట్టాడు. ‘మనసంతా నువ్వే’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతే అతని స్టార్‌ మారిపోయింది. ఉదయ్‌కిరణ్‌ అంటే యంగ్‌ స్టార్‌ హీరో. అతని డేట్స్‌ దొరకడం కష్టమయ్యేది ఒకప్పుడు. కానీ సక్సెస్‌తోనే అవకాశాలు, అది పోతే దాంతోపాటే అవకాశాలూ దూరమైపోతాయని అతనికి తెలియడానికి పెద్దగా టైమ్‌ పట్టలేదు.

వరుస పరాజయాలతో ఇండస్ట్రీలో ఉదయ్‌కిరణ్‌ ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మంచి కథలు ఎంచుకోవడంలో పొరపాట్లు చేశాడు. సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ కామన్‌ అనీ, మంచి హిట్‌ దొరికితే కెరీర్‌ గాడిన పడ్తుందనీ భావించి మంచి కథ కోసం ఎదురు చూశాడుగానీ, అవకాశాలు దొరకలేదు. తమిళ, తెలుగు సినిమాల్లో వచ్చిన సినిమాలు వచ్చినట్లే ఫెయిలయ్యేసరికి డీలాపడ్డాడు.

ఇలాంటి పరిస్థితులు సినిమా పరిశ్రమలో చాలామందికి వస్తాయిగానీ, కొందరే ధైర్యం కోల్పోతారు. వేరే సమస్యలూ గుక్క తిప్పుకోనివ్వవు. అలా ఉదయ్‌కిరణ్‌ సవాలక్ష సమస్యలు చుట్టుముట్టేసరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయికి మాటిచ్చాడు.. జీవితాంతం తోడుగా వుంటాననీ, కానీ మాట నిలబెట్టుకోలేదు, అర్థాంతరంగా తనువు చాలించాడు.

ఉదయ్‌కిరణ్‌ మరణం సినీ పరిశ్రమకు గుణపాఠం కావాలి. ఫెయిల్యూర్స్‌లో వున్నవారికి ఏదో ఒక అవకాశం ఇచ్చేలా పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకులు ప్రయత్నించాలి. యువతరం చచ్చి సాధించేదేమీ లేదని గుర్తించాలి. ఉదయ్‌.. నువ్వు లేవు.. కానీ నీ సినిమాలున్నాయి.. అవెప్పటికీ ప్రేక్షకుల్ని రంజింపజేస్తూనే వుంటాయి. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ ఉదయ్‌కిరణ్‌.
మరిన్ని సినిమా కబుర్లు
new comedian