Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Massage Parlours

ఈ సంచికలో >> సినిమా >>

ఆ రోజులు కావివి

Not at all those days
ఒకప్పుడు సినిమా అంటే గొప్ప. సినిమాల్లో నటించడం ఓ ప్యాషన్‌. అందుకనే డబ్బు ఆర్జనతో సంబంధం లేకుండా సినిమాల్లోకొచ్చేవారు. కానీ ఇప్పుడలా కాదు. సినిమాల్లో నటించడం ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ పేరు, డబ్బు సంపాదించుకోవాలని వచ్చేవారి సంఖ్య పెరిగింది. వారి కారణంగా నిర్మాతలకూ వాచిపోతోందిప్పుడు. అడ్వాన్సులు ఇస్తే తప్ప, చిన్న చిన్న నటీనటులూ సినిమాల్లో నటించడానికి ఒప్పుకోవడంలేదు.

కమెడియన్లలో ఈ తీరు ఇంకా దారుణంగా కనిపిస్తున్నది. ఒక్క సినిమాతో పేరొస్తే చాలు, 50 వేలకు పైనే రోజుకు డిమాండు చేస్తున్నారంట చోటా మోటా కమెడియన్లు. తక్కువ అంటే 35 వేలు. వెండితెర కాదంటే బుల్లి తెర కూడా వీరికి అవకాశాలు కలిపిస్తుండడంతో వారెప్పుడూ బిజీగానే ఉంటున్నారు. ప్రేక్షకులూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకోవడం వల్ల వీరికి ఉన్న డిమాండు రోజు రోజుకీ పెరుగుతున్నది.

కొన్ని సందర్భాలలో నిర్మాతలు ఇలాంటి చిన్న నటీనటులతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒప్పుకున్న విధంగా సినిమాలను పూర్తి చేయడానికి సహకరించడంలేదట కొందరు. అలాంటి ఘటనలతో నిర్మాతలు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఒకనాటి రోజులతో పోల్చుకుంటే ఇది డబ్బుల కాలం అని అనిపించకమానదు ఇలాంటి విషయాలు తెలుసుకున్నాక.

ఒకప్పుడు అడ్వాన్సులు తీసుకోకుండా నమ్మకంతో పని చేసేవారు. షార్ట్‌ లివింగ్‌.. తొందరగా కెరీర్‌ అయిపోతోంది. సక్సెస్‌ వచ్చేసరికి కొందరు కమెడియన్లు.. 50 వేలకు తక్కువలో రావడంలేదు. రోజుకి. టీవీల్లోనో, సినిమాల్లో అయినా..
మరిన్ని సినిమా కబుర్లు
UdayKiran Foundation started