Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Akkineni quotes as book

ఈ సంచికలో >> సినిమా >>

పంచె కట్టే హీరోలుంటారా?

Traditional wear heros is there?

సినిమాల్లో పంచెకట్టుతో కనిపించే హీరోలు చాలామంది. కాని నిజ జీవితంలో పంచెతో కనిపించేవారు అరుదు. వయసు మీద పడినప్పటికీ, తెలుగు దనానికి ప్రతీక అయిన పంచె ధరించేందుకు ఎక్కువమంది ఇష్టపడరు. కాని అక్కినేని అలా కాదు. అక్కినేని అంటేనే తెలుగుదనం అనేంతలా ఆయన పంచెకట్టు ఉంటుంది.

ఇప్పుడు అక్కినేని మన మధ్యలేరు. కాని పంచెకట్టు, తెలుగుదనం అంటే అక్కినేని గుర్తుకొస్తారు. భవిష్యత్తులో పంచెకట్టుతో కనిపించే హీరోలను నిజ జీవితంలో చూడలేం. తెరపై పాత్రల కోసం పంచెకట్టులో కనిపిస్తే కనిపించవచ్చు. పదహారణాల తెలుగుదనం ఉట్టిపడే అక్కినేని మాట, ఆయన హుందాతనం ఎవరిలోనైనా చూడగలమా? అని ప్రశ్నించుకుంటున్నారు సినీ పరివ్రమవారే.

చదువుకోకపోయినా, తెలుగు భాషమీదా, ఇంగ్లీషు భాష మీదా పట్టు సంపాదించుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. సందర్భానుసారం ఆంగ్ల పదాలను ప్రయోగించినా, ఆయన మాటలలో ఎక్కువగా తెలుగు మాటలే ఉండేవి. అవి కూడా వాడుకలోని సాధారణ పదాలు కాక, క్లిష్టమైన పదాలూ ఉండేవి. పంచెకట్టులో అయినా, తెలుగు మాటల్లో అయినా అక్కినేని ప్రత్యేకతే వేరు.

పంచెకట్టు హుందాతనాన్నిస్తుంది, సాధారణ జీవితాన్ని, ఆనందకరమైన జీవనాన్ని సూచిస్తుంది. ఇది అక్కినేని మాట.

మరిన్ని సినిమా కబుర్లు
Award to Bapu garu in Dubai