Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-9 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

క‌మ‌ల్ కూతురైతే ఏంటి..? - శ్రుతి హాసన్

Interview with Shruti Haasan

ఎక్క‌డ పోయిందో అక్క‌డే వెతుక్కోమంటారు పెద్ద‌లు. శ్రుతిహాసన్ అదే ప‌నిచేసింది. ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించిన చోట‌... విజ‌య‌పు తీపి కూడా రుచి చూసింది. హిందీలో తొలి సినిమా ల‌క్‌. అది ఫ్లాప్‌. తెలుగులో తొలి అడుగు అన‌గ‌న‌గా ఓ ధీరుడుతో త‌డ‌బ‌డింది. ఐరెన్ లెగ్ అనే ముద్ర ప‌డిపోవ‌డానికి అంత‌కంటే ఇంకేం కావాలి. కానీ శ్రుతి బెదిరిపోలేదు. కృంగిపోలేదు. ఓడిన చోటే గెలిచింది. తెలుగులోనూ, బాలీవుడ్‌లోనూ త‌న స్టామినా చూపించుకొంది. గోల్డెన్ లెగ్‌గా కీర్తి తెచ్చుకొంది. అయితే... ఈ విజ‌యాలేం ఊర‌కే రాలేదు. దాని కోసం చాలా క‌ష్ట‌ప‌డింది. అయితేనేం... ఇప్పుడా ప్ర‌తిఫ‌లం అనుభ‌విస్తోంది. ఎవ‌డు సినిమాతో ఈ యేడాది తొలి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకొంది. ఈ సంద‌ర్భంగా శ్రుతిహాస‌న్ తో మాట‌ల ముచ్చ‌ట్లు ఇవీ...

* కొత్త యేడాదికి విజ‌యంతో శ్రీ‌కారం చుట్టారు... కంగ్రాట్స్‌.
- థ్యాంక్సండీ. నిజంగా ఇది గుడ్ బిగినింగ్‌. ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం ఎవ్వ‌రికైనా మంచి కిక్ ఇస్తుంది. నిజం చెప్పాలంటే టీమ్ అంతా ఈ మూమెంట్ కోస‌మే చాలాకాలం నుంచి ఎదురుచూస్తోంది.

* ఈ సినిమా వ్య‌క్తిగ‌తం మీకెంత ప్ల‌స్‌..?
- ఓ సినిమా ఫ్లాప్ అయితే క‌థానాయిక‌నూ బాధ్యురాలిని చేస్తారు క‌దా..?  అలానే హిట్ కొడితే మా వాటా మాకొస్తుంది. అందుకే ఈ సినిమా నాక్కూడా ప్ల‌స్సే.

* సెకండాఫ్‌కే ప‌రిమిత‌మైపోయారు క‌దా..?
- క‌థ అలాంటిది. అయినా సినిమా అంతా నేనే క‌నిపించాల‌న్న నియ‌మం ఎప్పుడూ పెట్టుకోలేదు. అలాగైతే రామ‌య్యా వ‌స్తావ‌య్యాలో అతిథి పాత్ర‌లో క‌నిపిస్తానా..?

* ఆ సినిమా మీకు చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది క‌దా..?
- అవును. కాక‌పోతే మంచి ప్ర‌య‌త్న‌మే చేశాం. ఆ తృప్తి ఉంది.

* వ‌రుస‌గా మెగా హీరోల‌తోనే జ‌త క‌డుతున్నారు. ఏమిటి క‌థ‌...
- క‌థానాయ‌కుడిని ఎంచుకొనే సౌల‌భ్యం నాకు లేదండీ. అది ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌ని. అయినా ముందు హీరోని అనుకొనే క‌దా, ఆ త‌ర‌వాత క‌థానాయిక‌ను ఎంచుకొనేది. అయినా ప‌వ‌న్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీ స్టార్ హీరోలు. వీళ్ల‌తో న‌టించాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి.?

* అదే ఛాయిస్ మీకిస్తే ఏ హీరోని ఎంచుకొంటారు..?
- చాలా సీక్రెట్‌... నేను చెప్ప‌కూడ‌దు.

* ఇంత‌కీ ఎలా ఉంది కెరియ‌ర్‌
- చాలా బాగుంది. ఎవ్వ‌రికైనా అడుగుపెట్ట‌గానే విజ‌యాలు వ‌చ్చేయ‌వు. నిరీక్షించాలి. నేను ఆ ప‌నే చేశా. మంచి క‌థ‌లు, మంచి ద‌ర్శ‌కులు.. ఇవి వ‌చ్చే వ‌ర‌కూ ఓపిగ్గా ఉండాలి. అన్నీ మనం అనుకొన్న‌ట్టే జ‌ర‌గ‌వు. గ‌బ్బ‌ర్‌సింగ్‌లాంటి సినిమా రావ‌డానికి నేనెంత నిరీక్షించానో..!

* తెలుగు, త‌మిళం, హిందీ... మూడు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నారు. క‌ష్టం అనిపించ‌డం లేదా?
- ఎందుకనిపిస్తుంది. నాకు షూటింగ్ లేక‌పోతే బోర్‌. పొద్దున్న లేచిన‌ప్పుడు నాచేతినిండా ప‌ని ఉండాలి. ఖాళీగా కూర్చోవ‌డం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అతి తెలుగు సినిమానా, మ‌ల‌యాళ‌మా అనే తేడా చూడ‌ను.

* క‌మ‌ల్ కూతురు క‌దా. ఆ ఒత్తిడి ఎలా అధిగ‌మిస్తున్నారు?
- క‌మ‌ల్ కూతురైతే ఏంటి? బ‌య‌టవాళ్ల‌కూ నాకూ ఏదో తేడా ఉంద‌నుకోను. ఎవరికి వాళ్లు నిరూపించుకోవాలిక్క‌డ‌. క‌మల్ కూతురు క‌దా అనే గుదిబండ నేనెప్పుడో దించేసుకొన్నాను. శ్రుతిని శ్రుతిలానే చూడండి.

* స‌రిగ‌మ‌లు ఎప్పుడు ప‌లికిస్తారు?
- దాన్నిఎప్పుడూ వ‌దులుకోను. మ్యూజిక్ నా ప్యాష‌న్‌. అయితే ఇంకొంచెం స‌మ‌యం ఉంది. కొన్నాళ్లు సినిమాలు ప‌క్క‌న పెట్టి సంగీతంపై దృష్టిసారిస్తా.

* ద‌ర్శ‌క‌త్వం కూడానా..?
- అమ్మో అది చాలా పెద్ద బాధ్య‌త‌. నేనంత బ‌రువు మోయ‌లేను

* త‌ర‌వాతి సినిమాలేంటి?
- రేసుగుర్రంలో న‌టిస్తున్నా. గ‌బ్బ‌ర్‌లో క‌థానాయిక‌నేనే. అదికాకుండా వెల్‌క‌మ్‌కి సీక్వెల్ తీస్తున్నారు.

* ఓకే... ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ.

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Love You Bangaram