వర్మ స్కూల్ నుంచి వచ్చామని చెప్పుకోవడం గొప్పతనంగా భావిస్తారు యువ దర్శకులు. తెలుగులో వర్మని ‘గురువు’ అని చాలామంది దర్శకులు చెబుతుంటారు. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ సహా చాలామంది దర్శకులున్నారు అలాంటివారు టాలీవుడ్‌లో. అలాంటివారంతా తెలుగులో పెద్ద దర్శకుల స్థానాల్లో వున్నారు.
కృష్ణవంశీ ప్రస్తుతం చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ కూడా పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ కూడా అంతే. దర్శకుడిగా పూరి బ్రాండ్ వాల్యూ ఓ రేంజ్‌లో వుందిప్పుడు. వర్మ శిష్యులంతా టాప్ లీగ్‌లో వుంటే, వర్మ మాత్రం పెద్ద హీరోల జోలికి వెళ్ళడంలేదు. తెలుగు సినిమాలు పూర్తిగా ఒకప్పుడు మానేసిన వర్మ, ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్‌లో సినిమాలు వరుసగా చేయాలనుకుంటున్నాడు.
ఇప్పుడు వర్మ, మోహన్‌బాబుతో ఓ సినిమా చేస్తుండగా, ఆ సినిమా తర్వాత వర్మ పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం వుందని తెలుస్తోంది. వర్మతో సినిమాలు చేయడానికి యంగ్ హీరోలు కూడా ఉత్సాహం చూపుతారు. సో, వర్మతో నెక్స్‌ట్ సినిమా చేయబోయే ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో చూడాలిక.
|