Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vidhya get a chance in nag movie?

ఈ సంచికలో >> సినిమా >>

ఆషామాషీ ‘కత్తి’ కాదంట

something special knife....

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ‘తుపాకీ’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోవడం తమిళ హీరో విజయ్‌నీ, ఆ చిత్ర దర్శకుడు మురుగదాస్‌కీ నిరాశనే మిగిల్చింది. అందుకనే వెంటనే ఇంకో సినిమా చేస్తున్నారు వారిద్దరూ. అదే ‘కత్తి’ సినిమా. హాలీవుడ్‌ స్థాయిలో వుండేలా దర్శకుడు మురుగదాస్‌ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు.
ఇప్పటివరకు దక్షిణాది సినిమాల్లోనే కాక, హిందీలో కూడా లేని విధంగా సినిమా ట్రెయిలర్‌ని కొత్తగా రూపొందించి వదిలారు. దానికి విజయ్‌ అభిమానుల నుంచి గుడ్‌ రిపోర్ట్‌ వస్తోంది. తమిళంతోపాటు తెలుగులో ఎలాగూ ఈ సినిమాని విడుదల చేస్తారు. తెలుగులోనే కాకుండా హిందీలోకి కూడా ఈ సినిమాని డబ్‌ చేయాలని మురుగదాస్‌ ఇప్పటికే నిర్ణయించుకున్నాడట.
హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోమని ‘రోబో’ సినిమా నిరూపించింది. దాన్ని తలదన్నేలా ‘కత్తి’ ఉండబోతున్నదంట. భారీ బడ్జెట్‌తో వస్తున్న ‘కత్తి’ సినిమా తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందనే ధీమాతో వున్నాడు హీరో విజయ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam