Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
her worth 1.5 crore?

ఈ సంచికలో >> సినిమా >>

వర్మ ఇంటర్నెట్‌ బిజినెస్‌

varma internet bussines

సినిమా పంపిణీ అనేది చిత్రమైన వ్యవహారం. పోటీ కారణంగా కొన్ని సినిమాల పంపిణీ హక్కులు ‘టోటల్‌ బిజినెస్‌’ని మించి కొనేసి ఇబ్బంది పడుతుంటారు పంపిణీదారులు. కొన్నిసార్లు పోటీ లేక బిజినెస్‌ చేసే సినిమాకీ తక్కువ కోట్‌ చేసి పంపిణీదారులు దక్కించుకోవడం జరుగుతుంటుంది. సినిమా అంటేనే ‘చిత్ర’మైన రంగం. పంపిణీ రంగం ఇంకా చిత్రమైనది.

ఆ పంపిణీ రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చేందుకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నడుం బిగించారు. ‘వేలంపాట’ ద్వారా పంపిణీ హక్కుల్ని పొందేలా తన కొత్త సినిమాకి కొత్త ప్రక్రియను మొదలు పెట్టారు వర్మ. విష్ణు హీరోగా రూపొందిస్తున్న సినిమాకి ఈ ప్రక్రియను వాడుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌ సైట్‌ ద్వారా సినిమా హక్కుల్ని వేలంపాటలో దక్కించుకోవచ్చునని వర్మ చెబుతున్న విషయం.

వర్మ అంటేనే సంచలనం. వర్మ ఏం చేసినా సంచలనం. కాబట్టి వర్మ చేపట్టిన ఈ ఇంటర్నెట్‌ బిజినెస్‌ వేలం ప్రక్రియ విజయవంతమైతే అప్పుడంతా ‘భలా వర్మ..’ అని అనకుండా ఉండరు కదా. లెట్స్‌ సీ వర్మ న్యూ ట్రిక్‌ సినిమా బిజినెస్‌కి ఎలా హెల్పవుతుందో.

మరిన్ని సినిమా కబుర్లు
deal settled between harish and pawan