Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
deal settled between harish and pawan

ఈ సంచికలో >> సినిమా >>

రాజకీయమా? సినిమాలా? ఎటూ తేల్చుకోలేక..

politics? movies? confused...

రాజకీయాల్లోకి వస్తూనే ఎంపీ అయిన కన్నడ సినీ హీరోయిన్‌ రమ్య, తక్కువ కాలంలోనే ఎంపీ పదవిని పోగొట్టుకుంది. రాజకీయాలకు కొంచెం గ్యాప్‌ ఇచ్చి, అంతకుముందు ఒప్పుకున్న సినిమాని పూర్తి చేసే పనిలో పడిరదామె. సినిమాల్లో కొనసాగవలసిందిగా నిర్మాతలు ఆమెను కోరుతున్నప్పటికీ, సినిమాలకంటే రాజకీయాల ద్వారానే ప్రజలకు సేవ చేయవచ్చని ఆమె అనుకుంటోన్నదట.

‘సినిమాల గురించి నాపై ఒత్తిడి తీసుకురావొద్దు.. కాలమే అన్ని సమస్యలకూ పరిష్కారం చూపిస్తుంది. నేనిప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నాను..’ అని సన్నిహితులైన దర్శక నిర్మాతలకు చెప్పిందట రమ్య. తెలుగులోనూ, తమిళంలో కూడా హీరోయిన్‌గా నటించిన ఈ బొద్దుగుమ్మకి సినిమా ` రాజకీయాల్లో ఏది ముఖ్యమో తేల్చుకోలేకపోవడం అనే పెద్ద కష్టమే వచ్చింది.

సినిమాలు చేసుకుంటూ, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ రాజకీయాల్లో కొనసాగవచ్చు కదా అని సన్నిహితులు సూచించగా, ఒక్కసారి రాజకీయాలలోకి వెళ్ళిన తరువాత, ప్రత్యర్థుల నుంచి రాజకీయ విమర్శలు వస్తాయని వాటిని సినిమా రంగంలో కొనసాగుతూ తట్టుకోవడం కష్టమని వివరిస్తుంది రమ్య. ఆమె చెప్పిందీ పాయింటే. మరెందుకు రాజకీయాల్లోనే ఉంటానని ఖచ్చితంగా ఆమె చెప్పడంలేదు?

మరిన్ని సినిమా కబుర్లు
master blaster & master beauty will attend PVP square inauguration