Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pathashaala will release on october 2nd

ఈ సంచికలో >> సినిమా >>

బుడుగు

budugu

ప్రతి తల్లి తండ్రీ తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అది ఆ పిల్లలపై ఒత్తిడి పెంచుతుంది. పిల్లల ఇంటరెస్ట్, సామర్ధ్యానికి మించిన ఒత్తిడి పెరిగితే, పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు? అలాంటి పరిస్తితి ఎదురన ఒక పిల్లాడు అతని చుట్టొ జరిగిన విచిత్ర సంఘటనలతో అతని కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? వారంతా కల్సి ఆ సంస్య నుంచి ఎలా బయట పడ్డారు అలాంటి ఒక యధార్థ సంఘటన్ ఆధారంగా ఒక పిల్లాడి చుట్టూ జరిగిన కథతో నిర్మించిన థ్రిల్లర్ ఈ బుడుగు. ఇది పూర్తిగా చలిడ్ క్లినికల్ సైకాలజీ కోణంలో నడిచే ఇంటెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్. ఇద్దరు పిల్లలు, వారి తల్లి తండ్రు, వారి కుటుంబం మధ్య పట్టు సడలని డ్రామాతో నడుస్తూ ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేసే కథ.
త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్రం హైదరాబాద్ ఈన్నోవేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించబడుతున్నది. ఇందులో ప్రధాన పాత్రలో లక్ష్మి మంచు, శ్రీధర్ రావ్, ప్రేం బాబు నటిస్తూండగా, మరికొన్ని ముఖ్య పాత్రల్లో బేబి డాలీ, సన, ఇందు, ఆనంద్, శైలజావాణి. దీనికి సంగీతం : సాయి కార్తీక్, ఎడిటింగ్ : ష్యాం మేంగా, కళా దర్శక్ త్వం : ఏ. రాం. సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు అందిస్తున్నారు. రచయిత- దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ, ఇలాంటి కథ ఇంతకుముందు రాలేదని చెప్పవచ్చు. నాకు తెలిసిన ఒక సంఘటన ఆధారంగా పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి అనేకమంది సైకాలజిస్టులతో చర్చించి తయారుచేసుకున్న కథ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ పుల్లొరి. నిర్మాతలు : భాస్కర్ మరియు సారికా శ్రీనివాస్. మన్మోహన్

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam