Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Hair Care | Best Ayurveda Tips | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay) (Telugu)

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Deepavali

ఎయిర్ పోర్ట్ ప్రయాణం - బన్ను

Airport Journey

అమెరికా ప్రయాణం లేక యూరప్ ప్రయాణం అనాలి గానీ... 'ఎయిర్ పోర్ట్ ప్రయాణం' ఏమిటా? అనుకుంటున్నారా? నా అనుభవం అలాంటిది మరి!

నేను తరుచూ 'సింగపూర్' ప్రయాణిస్తుంటాను. ఆ ఫ్లైటు అర్ధరాత్రి వుండటంవలన నిద్ర వుండదు. అంచేత రాత్రి ఎలాగూ నిద్రుండదని మధ్యాహ్నం పడుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్తుంటాను. ఆ రోజు కూడా నిద్రపోయాను. 'ఫ్లైట్' టైమవుతుందని ఇంట్లో లేపారు. మరో మంచి కబురేంటంటే మా డ్రైవర్ రాలేదట. 'సరే' అని... ఓ టాక్సీ వాళ్ళకి ఫోన్ చేసి... టాక్సీ రాగానే ఎక్కాను. నా నిద్రమత్తింకా వదల్లేదు. ఆ టాక్సీ డ్రైవర్ రైట్ బ్లింకర్ కొట్టడం గమనించి...'బాబూ రైట్ కాదు స్ట్రెయిట్ గా వెళ్ళాలి' అన్నాను. 'ఓకే... సార్' అన్నాడు. పక్కకి ఒరుగుతూ "హైదరాబాద్... కొత్తా"? అనడిగాను. దానికి అతను "కాదు సార్... డ్రైవింగ్ కి కొత్త" అన్నాడు. "వ్వాట్..." అనే పదం నా నోట్లోనే ఆగిపోయింది. నిద్రెప్పుడో ఎగిరిపోయింది. స్లోగా 'సీట్ బెల్ట్' లాక్కుని పెట్టుకొని కళ్ళు పెద్దవిగా చేసుకొని కొయ్యలా  చూస్తూ వుండిపోయా!

'జైంట్ వీల్' ఎక్కిన బ్రహ్మానందం ఫార్సు ఏదో సినిమాలో చూసిన గుర్తు. అదే నా పరిస్థితి. టర్నింగ్ లు కొడుతూ నా గుండె 'గడియారం' లా కొట్టుకోవటం నాకు తెలుస్తోంది. కళ్ళు మూసుకుని ఆంజేనేయ స్తోత్రం చదువుకుంటూ... స్లోగా కళ్ళు తెరిచేసరికి 'ఎయిర్ పోర్ట్' కనపడింది - హమ్మయ్య అనుకుంటూ... 'బతుకుజీవుడా...' అనుకుంటూ వెళ్ళిపోయాను.

హైదరాబాద్ లో టాక్సీల సంఖ్య పెరిగి డ్రైవర్ల కొరత ఏర్పడుతోందని... అప్పుడు నాకర్ధమైంది!

మరిన్ని శీర్షికలు
atla tadiya