Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with manchu manoj

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష : కరెంట్‌ తీగ

Movie Review - Current Theega

చిత్రం: కరెంట్‌ తీగ
తారాగణం: మంచు మనోజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, పవిత్ర లోకేష్‌, తనికెళ్ళ భరణి, సన్నీలియోన్‌, పృధ్వీ, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, రఘుబాబు తదితరులు.
చాయాగ్రహణం: ముత్యాల సతీష్‌
సంగీతం: అచ్చు
నిర్మాణం: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
దర్శకత్వం: జి. నాగేశ్వర్‌రెడ్డి
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేదీ: 31 అక్టోబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
ఓ ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు రాజు (మనోజ్‌), టీచర్‌ సన్నీ (సన్నీలియోన్‌)తో ప్రేమలో పడ్తాడు. సన్నీని ప్రేమిస్తున్న విషయాన్ని ఆమెకు చేరవేయడానికి కవిత (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) సహాయం కోరతాడు రాజు. కవితే, ఆ ఊరి పెద్ద మనిషి శివరామరాజు (జగపతిబాబు) కుమార్తె. శివరామరాజుకి ప్రేమ వివాహాలంటేనే అసహస్యం, కోపం. ఇంకోపక్క రాజు ప్రేమని సన్నీ తిరస్కరిస్తుంది. కానీ రాజుని కవిత ప్రేమిస్తుంది. రాజు కూడా కవితతో ప్రేమలో పడ్తాడు. ప్రేమంటే అసహ్యం, కోపంతో వుండే శివరామరాజుని రాజు ఒప్పించి, అతని కుమార్తె కవితను దక్కించుకున్నాడా? లేదా? అనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
మనోజ్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో వారెవా అన్పిస్తాడు. నటన పరంగానూ రాణించాడు. డైలాగ్‌ డెలివరీలోనూ, బాడీ లాంగ్వేజ్‌ విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు మనోజ్‌. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటన పరంగా ఓకే. గ్లామరస్‌గానూ కన్పించింది. క్యూట్‌గా, మంచి సెక్సప్పీల్‌తో ఆకట్టుకుంటుంది.జగపతిబాబు పాత్రకు అవసరమైన పెర్ఫామెన్స్‌తో సినిమాకి ప్లస్‌ అయ్యాడు. సన్నీలియోన్‌ తనకు అప్పగించిన గ్లామర్‌ డిపార్ట్‌మెంట్‌ని బాగా హ్యాండిల్‌ చేసింది. తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది. పృధ్వీ, వెన్నెల కిషోర్‌ తదితరులంతా కావాల్సినంత కామెడీ పండించారు. పవిత్ర లోకేష్‌ ఓకే. తనికెళ్ళ భరణి తదితరులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అన్పించారు.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. మ్యూజిక్‌ బావుంది. మూడు పాటలు తెరపైనా చూడ్డానికి చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా వుంది. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. స్క్రీన్‌ప్లే బావుంది. సినిమాకి అవసరమైన రీతిలో ఎడిటింగ్‌ విభాగం వర్క్‌ చేసింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి రిచ్‌ లుక్‌ని తీసుకొచ్చాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని రిచ్‌గా రూపొందించారు నిర్మాత.

రొటీన్‌ స్టోరీనే అయినా చెప్పే విధానంలో కొత్తగా వుంటే ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది ఏ సినిమా అయినా. కావాల్సినన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో, ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవడంతో సినిమా సాఫీగా సాగిపోయింది. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, రొమాన్స్‌తో సాగిపోతే, సెకెండాఫ్‌లో వాటితోపాటు కాస్త మెలోడ్రామా కన్పిస్తుంది. ఓవరాల్‌గా సినిమా మంచి ఎంటర్‌టైనర్‌ అనిపిస్తుంది. బాక్సాఫీస్‌ వద్ద సినిమా మంచి ప్రాఫిట్స్‌ని నమోదు చేయొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే : సరిపడా ఓల్టేజ్‌ వుందీ కరెంటు తీగలో

అంకెల్లో చెప్పాలంటే : 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka