Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
memusaitam great commitment

ఈ సంచికలో >> సినిమా >>

పూజా హెగ్దే గాన మాధుర్యం

sweet singing by pooja hegde

హీరోయిన్స్‌ డబ్బింగ్‌ చెప్పుకోవడమే కష్టం. పదేళ్ళుగా తెలుగు సినిమాల్లో ఉన్నప్పటికీ, తెలుగు బాష నేర్చుకోవడానికి ఇష్టపడని హీరోయిన్లు ఉన్నారు, అలాగే ఒక్క సినిమాతోనే తెలుగులో మాట్లాడే ఇతర భాషల హీరోయిన్లు కూడా లేకపోలేదు. ‘ఒక లైలా కోసం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పూజా హెగ్దే, రెండో సినిమా ‘ముకుంద’ నాటికి తెలుగులో కొంత ప్రావీణ్యం సంపాదించింది.

‘ముకుంద’ ఆడియో విడుదల వేడుకలో ఆ సినిమా పాటని అచ్చంగా తెలుగులోనే పాడిరది. డిక్షన్‌లో కొంత ఇబ్బంది పడినప్పటికీ, పాట పాడాలన్న ఆమె ఆలోచన గొప్పది. తదుపరి సినిమాను ఆమె బాలీవుడ్‌లో చేస్తోంది. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించనున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌.

తెలుగు సినిమా ‘ముకుంద’ విషయానికి వచ్చినట్లయితే, ఈ సినిమా ద్వారా మెగాస్టార్‌ కుటుంబం నుంచి ఆయన సోదరుడి కుమారుడు వరుణ్‌తేజ హీరోగా పరిచయం అవుతున్నాడు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్‌ మధు సంయుక్తంగా ఈ ‘ముకుంద’ను నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
pity heroyin............