Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondi chooddam

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : చక్కిలిగింత

Movie Review - Chakkiligintha

చిత్రం: చక్కిలిగింత
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, రెహానా, తాగుబోతు రమేష్‌, వివా హర్ష, సురేఖ, చైతన్య కృష్ణ తదితరులు
చాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
సంగీతం: మిక్కీ జె మేయర్‌
నిర్మాణం: మహీష్‌  ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
దర్శకత్వం: వేమారెడ్డి
నిర్మాత: నరసింహాచారి, నరసింహారెడ్డి
విడుదల తేదీ: 5 డిసెంబర్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
ప్రేమా గీమా జాన్తా నై అనే కుర్రాడు ఆది (సుమంత్‌ అశ్విన్‌). తానే కాదు, తన స్నేహితులూ ప్రేమ వైపూ, అమ్మాయిలవైపూ వెళ్ళకుండా వారిని ఇన్‌ఫ్లుయెన్స్‌ చేస్తాడతడు. అలా ఆది చదువుతున్న కాలేజీలో, అమ్మాయిలకు, అబ్బాయిలకూ ఎంటర్‌టైన్‌మెంట్‌ కొరవడుతుంది. ఈ టైమ్‌లోనే అవి (రెహానా) ఆ కాలేజ్‌కి వస్తుంది. అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని, ఆదిని లవ్‌లో పడేస్తే మొత్తం మేటర్‌ సెటిలైపోతుందని భావిస్తుంది అవి. తన ప్రయత్నంలో అవి సక్సెస్‌ అయ్యిందా? ప్రేమన్నా, అమ్మాయిలన్నా అస్సలు అటువైపు చూడని ఆది, అవి వలలో పడతాడా? అనేది తెరపై చూస్తేనే బావుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే:
నటుడిగా సుమంత్‌ అశ్విన్‌ ఆల్రెడీ తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఈ సినిమాలో తన పాత్రకు అవసరమైనంత మేర నటనా ప్రతిభను ప్రదర్శించాడు. రెహానా కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఓకే. నటిగా పరిణతి చెందాల్సింది చాలా వుందామెకు.
తాగుబోతు రమేష్‌ మామూలే. సురేఖా వాణి ఓకే. వివా హర్ష బాగానే నవ్వించాడు. చైతన్య కృష్ణ కన్పించినంత సేపూ ఆకట్టుకుంటాడు. మిగతా పాత్రధారులకు పెద్దగా తగిన స్కోప్‌ దొరకలేదు.

రొమాంటిక్‌ స్టోరీ లైన్‌ ఎంచుకున్న దర్శకుడు, నెరేషన్‌లో జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత విఫలమయ్యాడు. స్క్రిప్ట్‌ యావరేజ్‌గా వుంది. స్క్రీన్‌ప్లే కూడా ఆకట్టుకునేలా ఏమీ లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావుంది. పాటలు కూడా బావున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా వుండాల్సింది. రొమాంటిక్‌ సినిమా, కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కావడంతో స్టైలిష్‌గా కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేయాల్సి వుంది. ఆ విభాగం ఆ పని చేయడంలో సక్సెస్‌ అయ్యింది.

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ సినిమాలనగానే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌, అవసరమైనంత రొమాన్స్‌ కలిసి వుండాలి. ఫస్టాఫ్‌ వరకూ అలాంటివాటికి డోకా లేకపోయినా, సెకెండాఫ్‌లో సినిమా గతి తప్పింది. లాజికల్‌ లూప్‌హోల్స్‌ ఎక్కువగా కనిపించాయి. దాంతో క్యారెక్టరైజేషన్స్‌ కన్‌ఫ్యూజన్‌లో పడ్డాయి. ముగింపు కూడా గందరగోళంగానే వుంది. యూత్‌ ఫుల్‌ మూవీ కావడంతో టార్గెట్‌ ఆడియన్స్‌ నుంచి కొంతవరకు రెస్పాన్స్‌ బాగానే వుండొచ్చు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించి వుంటే బెటర్‌ ప్రాడక్ట్‌ అయ్యేది.

ఒక్క మాటలో చెప్పాలంటే: చక్కిలిగింత పెట్టలేకపోయింది

అంకెల్లో చెప్పాలంటే: 2.25/5

మరిన్ని సినిమా కబుర్లు