Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
very very  special director

ఈ సంచికలో >> సినిమా >>

మాటలకందని విషాద‘చక్రం’

long live chakri

కాల చక్రం ఓ సంగీత దర్శకుడ్ని అర్థాంతరంగా తనలో కలిపేసుకుంది. అభిమానులకు అతన్ని, అతని సంగీతాన్ని దూరం చేసింది. సంగీత దర్శకుడిగా తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలు, ఎక్కువ విజయాలు సొంతం చేసుకున్న చక్రి, గుండెపోటుతో చనిపోయారనే వార్త తెలిసి ప్రతి ఒక్కరి మనసూ కకావికలం అయిపోయింది.

‘చక్రం’ సినిమాలోని ‘జగమంత కుటుంబం నాది..’ అనే పాట చక్రికి బాగా ఇష్టమైన పాటల్లో ఒకటి. విషాద గీతం అనాలో, జీవిత సత్యం అనాలో తెలియని పరిస్థితి ఆ పాట విన్నవారికి. చక్రి మరణం తర్వాత ఆ పాట టీవీల్లో మార్మోగుతుంటే, జగమంత అభిమాన కుటుంబాన్ని సంపాదించుకుని, అనూహ్యంగా తనువు చాలించిన చక్రిని తలుచుకుని ఆవేదన చెందని హృదయం లేదు.

2014 ప్రారంభంలో యువ నటుడు ఉదయ్‌కిరణ్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది అత్యంత విషాద ఘటన. చక్రి మరణం కూడా కూడా అలాంటి విషాదమే. తన పాటలతో, తన సేవా కార్యక్రమాలతో జగమంత కుటుంబాన్ని సంపాదించుకున్న చక్రి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన సందర్భంగా, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
hats off to vikram and shankar