Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hats off to vikram and shankar

ఈ సంచికలో >> సినిమా >>

చిన్న సినిమాల ‘పండగ’

small movies celebration

పెద్ద విజయం సాధించిన పెద్ద సినిమా గురించి ఎలా మాట్లాడుకుంటామో పెద్ద విజయం సాధించినా చిన్న సినిమా గురించి అలా మాట్లాడుకోలేం. కారణాలనేకం. అయినప్పటికీ చిన్న సినిమాకి కొన్నాళ్ళ నుంచి ప్రేక్షకుల్లో మంచి గౌరవం దక్కుతోంది. సినిమా నచ్చితే, దాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారెప్పుడు. అది చిన్న సినిమా విజయం సాధించినప్పుడూ ప్రూవ్‌ అవుతుంది.2014లో చిన్న సినిమాలు ఎక్కువే వచ్చాయి. కొన్ని ఘనవిజయాలు సాధిస్తే, కొన్ని బావున్నాయనిపించుకున్నాయి. ఆ స్ఫూర్తితో 2015లో కూడా చిన్న సినిమాలు ఎక్కువగానే రానున్నాయట. పెద్ద సినిమా బడ్జెట్‌లో పదోవంతు బడ్జెట్‌తోనే చిన్న సినిమాలు రూపొందుతున్న సందర్భాలు చూస్తున్నాం. అది శుభ పరిణామం.

యంగ్‌ జనరేషన్‌ టేస్ట్‌కి తగ్గ సినిమాలతోపాటు, ఆలోచింపజేసే సినిమాలూ ‘చిన్న సినిమా’ కోవలో ఎక్కువగా వస్తున్నాయి. యంగ్‌ జనరేషన్‌ కొత్త టాలెంట్‌తో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందిస్తుండడంతో, పెద్ద సినిమాలకు ధీటుగా చిన్న సినిమాలూ ప్రేక్షకులకు పండగ వాతావరణం కలిపిస్తున్నాయి. ఇది ఇండస్ట్రీకి శుభ పరిణామం.

మరిన్ని సినిమా కబుర్లు
joru and josh