|
ధూర్జటి : ఈ మేకకు తల వున్న చోట తోక, తోక యుండు చోట తల వున్నదేమి?
పెద్దన: బహుశా ఇది తెనాలి రామలింగడి మేక అయిఉండవచ్చు!! |
|
శుభరాముడు: "ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు" అని వేమన గారన్నారే?
అభిరాముడు: ఆయన రోజుల్లో రెండూ శుభ్రంగా వుండేవిలే!! |
|
|
|
సోమన్న: కరిమకరులు భయంకరంగా యుద్ధం చేశాయని రాశారే పోతన గారు, ఎలా?
భీమన్న: దివ్య దృష్టితో డిస్కవరీ ఛానెల్ చూసుంటారు!! |
|
శ్రీమతి: "మది దున్నుకు బ్రతక వచ్చు మహిలో సుమతీ" అని శతక కారుడు రాశాడే?
భానుమతి: "మహిలో సుమతీ" బదులు "మదిలో సుమతీ" అని చదువు కోవాలి! ఈ రోజుల్లో అదే సాధ్యం!! |
|
|
|
మొక్కన్న: నేనూ భాగవతానువదీకరణ చేసే వాడినే!
చిక్కన్న: మరెందుకు చేయలేదు?
మొక్కన్న: నాకు సంస్కృతం రాదు గనుక !! |
|
సూరన్న: ముక్కుతిమ్మనార్యుడి పలుకులు ముద్దు ముద్దుగా వుంటాయి, ఎందుచేత?
మారన్న: "పారిజాతాపహరణం" లో సత్యభామ అనే ముద్దుగుమ్మను వర్ణించాడులే!! |
|
|
|
వెంకప్ప: శ్రీ శ్రీ అనే కవి ఆడా? మగా?
గంగప్ప : ఆయన గారు "మగా కవి"!
("మగా" అంటే తమిళంలో 'మహా ' అని అర్థం!!) |
|
సోమిరెడ్డి: శ్రీనాథ కవి ఒక పద్యంలో "చిల్లర దేవుళ్ళు" అని రాసారట కదా! ఎవరు వాళ్ళు?
రామిరెడ్డి: ఈనాటి బస్ కండక్టర్లు!! |
|
|
|
చంటి నాయుడు: బ్రహ్మరాత బ్రహ్మ మాత్రమే చదవగలడట కదా? ఒకవేళ మరొకడు చదవ గలిగితే?
బంటి నాయుడు: అంటే మనూళ్ళో డాక్టరు రాసే ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాపు వాడు చదివినట్టు. అదేనా నీ ప్రశ్న? |
|
పనిశెట్టి: మీ ఆవిడ భాగవతం వినిపించిందా? గారెలు తినిపించిందా?
గినిశెట్టి: గారెలకి బదులు నాలుగు తన్నులు తినిపించింది.
మనిశెట్టి: ఎందుచేత?
గినిశెట్టి: మధ్యలో నిద్రపోయా!! |
|