Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review - ladies and gentlemen

ఈ సంచికలో >> సినిమా >>

ల‌క్ష‌న్న‌ర మంది చూస్తే చాలు

enough when reach 1lakh audiance-madhura sridhar

మార్కెట్ స్ట్రాట‌జీని క‌రెక్టుగా అర్థం చేసుకొన్న నిర్మాత‌ల్లో మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ఒక‌రు. ఎవ‌రి కోసం సినిమా తీయాలి?  ఎలాంటి సినిమా తీయాలి?  ఎంత‌లో తీయాలి అన్న లెక్క‌లు ఆయ‌న‌కు బాగా తెలుసు. ద‌ర్శ‌కుడిగా అనుభ‌వం ఉంది కాబ‌ట్టి.. క‌థ చెబుతున్న‌ప్పుడే ద‌ర్శ‌కుడి భావాల్ని ఆయ‌న ఒడిసిప‌ట్టేసుకోగ‌ల‌రు. త‌క్కువ బ‌డ్జెట్‌లో యూత్‌కి క‌నెక్ట్ అయ్యే సినిమాల్ని తీయొచ్చ‌ని స్నేహ‌గీతం, ఇట్స్‌మై ల‌వ్ స్టోరీ, మాయ సినిమాల‌తో నిరూపించారు. ఇప్పుడు లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ సినిమానీ ఆయ‌నే రూపొదించారు. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* లేడీస్ అండ్ జెంటిల్‌మెన్‌.. టైటిల్ క్యాచీగా ఉంద‌ని పెట్టారా..?
- (న‌వ్వుతూ)ఏదైనా ఓ ఎనౌన్స్‌మెంట్ చెప్పాలంటే `లేడీస్ అండ్ జెంటిల్‌మెన్‌` అంటూ సంభోదిస్తాం. ఈ సినిమాలో ఓ మంచి మాట చెప్ప‌బోతున్నాం.. అందుకే వాళ్లంద‌రికీ క‌నెక్ట్ అవ్వాల‌ని ఆ పేరు పెట్టాం.

* ఈ సినిమాతో యూత్‌కి మ‌రోమారు క‌నెక్ట్ అయిపోతార‌న్న‌మాట‌..
- ఇది యూత్ కోసం తీసిన సినిమానే కావ‌చ్చు. కానీ పెద్ద‌వాళ్ల‌నీ హెచ్చ‌రించే విష‌యాలున్నాయి. త‌ల్లిదండ్రులు హాల్‌లో కూర్చుని టీవీ చూస్తుటారు. ఆ స‌మ‌య‌లో పిల్ల‌లు బెడ్‌రూమ్‌లో ఇంటర్నెట్‌లో ప‌డిపోతున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారు, వాటిని ఎలా ఉప‌యోగించుకొంటున్నారు?  అనే విష‌యాల‌పై ఓ క‌న్నేయాలి.

* సైబ‌ర్ నేరాల‌పై చ‌ర్చించార‌ట‌..
- ఔను. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన తొలి తెలుగు సినిమా ఇదే. చాటింగుల‌తో దోస్తీ కోసం ఒక‌డు, అడ్డదారిలో డ‌బ్బులు సంపాదించాల‌ని మ‌రొక‌డు, స్నేహం కోసం ఓ గృహిణి... ఇంట‌ర్నెట్‌తో క‌నెక్ష‌న్ పెట్టుకొంటారు. ఈ ముగ్గురి ప్ర‌యాణం ఎలా సాగింద‌న్న‌ది క‌థ‌.

* ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్ అంటే.. యూత్ కి ఎక్కుతుందేమో. మ‌రి బీసీల మాటేంటి?
- ఈరోజు ఇంటర్నెట్ స‌దుపాయం లేని ఊరేదో చెప్పండి. మారు మూల ప్రాంతాల వాళ్లూ ఫేస్ బుక్‌తో అప్‌డేట్ అవుతున్నారు. ఈమ‌ధ్య నేనో ఊరెళ్లా. అక్క‌డ ఓకుర్రాడు నాతో ఫొటో తీయించుకొని.. అప్ప‌టిక‌ప్పుడు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసేశాడు. ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ ఏం కావాలి..? 

* ఘాటైన లిప్‌లాక్ ఉంద‌ట‌..
- అవును..నా ప్ర‌తి సినిమాలోనూ లిప్‌లాక్ ఉంటుంది. అది సెంటిమెంట్‌గా మారిపోయింది. ఇక నుంచి ప్ర‌తి సినిమాలోనూ ఇలాంటి ముద్దులుంటాయ్‌.

* క‌థ డిమాండ్ చేసింది.. అందుకే పెట్టాం అంటుంటారు. మీరు స్ట్ర‌యిట్‌గా చెప్పేస్తున్నారే..
- (న‌వ్వుతూ) క‌థ కూడా డిమాండ్ చేసింద‌నుకోండి..

* మెగాఫోన్‌కి కొంత‌కాలం నుంచి దూరంగా ఉంటున్నారు. కార‌ణం ఏంటి?
- ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ రిజ‌ల్ట్ న‌న్ను సందిగ్థంలో ప‌డేసింది. ఆ సినిమా బాగా నిరాశ ప‌రిచింది. న‌న్ను బాగా ఎగ్జైట్ చేసే క‌థ దొరికితే త‌ప్ప ద‌ర్శ‌క‌త్వం గురించి ఆలోచించ‌ను.

* నిర్మాత‌గా ఉన్న‌ప్పుడు మీలోని ద‌ర్శ‌కుడు మేల్కోడా..?
- లేదు.. సినిమా బాధ్య‌త‌ పూర్తిగా ద‌ర్శ‌కుడికే వ‌దిలేస్తా. నేనొక మెంట‌ర్‌గా ఉంటానంతే. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే కోచ్ అనుకోండి.

* మీ సినిమాల‌న్నీ ఏ సెంట‌ర్‌ని టార్గెట్ చేస్తుంటాయి.. కార‌ణం ఏంటి?
- మ‌న‌కున్న ఆడియ‌న్స్ ప‌ది కోట్లు. వాళ్లంద‌రూ సినిమాలు చూస్తారా..??  ఎంత బాగున్నా చూడ‌రు. అందులో ప‌ది శాతం మందిని టార్గెట్ చేసినా చాలు. నావన్నీ చిన్న సినిమాలు క‌నీసం ల‌క్ష‌న్న‌ర‌మంది చూస్తే... నా సినిమా గ‌ట్టెక్కేసిన‌ట్టే. ఏబీసీ గురించి మ‌నం ఇప్పుడు మాట్లాడుకొంటున్నాం. మ‌రో నాలుగేళ్లు అయితే ఈ విభ‌జ‌న ఉండ‌దు. సినిమా బాగుందా, లేదా.. వీటి గురించే మాట్లాడుకొంటారంతే.

* ప్ర‌స్తుతం చిన్న సినిమాలకు శాటిలైట్ లేదు.. భ‌యం లేదా..?
-  శాటిలైట్ మార్కెట్ ప‌రిస్థితి అంత బాలేదు. సినిమా బాగుంటే కొంటున్నారు. ముందే ఎగ‌బ‌డి కొనే ప‌రిస్థితి లేదు.  నా సినిమాల వ‌ర‌కైతే శాటిలైట్ బాగానే అయిపోతుంది. ఆ స‌మ‌స్య లేదు.

* మ‌రి ఆడియో రైట్స్ మాటేంటి?  
- ఆడియో రైట్స్ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగానే ఉంది. ఇది వ‌ర‌కట‌కంటే బెట‌ర్‌. ఎందుకంటే రింగ్‌టోన్స్‌, డౌన్‌లోడ్స్‌, ఎఫ్ ఎమ్‌.. ఇలా ర‌క‌ర‌కాల మార్గాల్లో డ‌బ్బులు తిరిగి రాబ‌ట్టుకోవ‌చ్చు. ఇది వ‌ర‌కు ఆడియో విడుద‌లైన రెండు మూడు నెల‌ల్లో దాని ఫ‌లితం తేలిపోతుంది. లాభ‌మా, న‌ష్ట‌మా అనేది ఓ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు 99 యేళ్ల వ‌ర‌కూ ఏదో ఓ రూపంలో ఆదాయం వ‌స్తూనే ఉంటుంది.

* శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నారట‌. ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింది..?
- క‌థ దాదాపుగా రెడీ. క్లైమాక్స్ విష‌యంలోనే క్లారిటీ లేదు.

* అస‌లు ఈ ఆలోచ‌న ఎందుకొచ్చింది?
- రాత్రికి రాత్రే స్టార్ అయిపోయి.. మ‌ళ్లీ ఓ రాత్రిలోనే అగాధంలో కూరుకుపోయిన ఆట‌గాడు శ్రీ‌శాంత్‌. అత‌ని క‌థ ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంద‌నిపించింది.

* శ్రీ‌శాంత్‌లోని నెగిటీవ్ యాంగిల్ కూడా చూపిస్తారా.?
- అదీ ఉంటుంది క‌దా. త‌న‌కో ప్రేమ‌క‌థ కూడా ఉంది. కొహ్లి - అనుష్క శ‌ర్మ‌రేంజు ల‌వ్ స్టోరీ అది.

* త‌రువాతి సినిమా...
- ఓం మంగ‌ళం మంగ‌ళం సినిమా తీస్తున్నాం. ఇదో కొత్త‌జోన‌ర్‌. న‌టీన‌టుల ఎంపిక అయిపోయింది. త్వ‌ర‌లో వాటి వివ‌రాలు ప్ర‌క‌టిస్తాం..

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌

- థ్యాంక్యూ.​
 
కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata1 - Enduko Enduko song from gopala gopala movie