Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cuty with naughty thoughts

ఈ సంచికలో >> సినిమా >>

యంగ్‌ హీరో కష్టం ఫలిస్తుందా

young hero

యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌ సక్సెస్‌ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతూనే ఉన్నాడు. సినిమా ప్రమోషన్‌ పట్ల ఎంతో శ్రద్ధతో వ్యవహరిస్తున్న వరుణ్‌, కథల ఎంపికలో పొరపాట్లతోనే ఫెయిల్యూర్స్‌ చూడాల్సి వస్తుంది. నటించే ప్రతి సినిమా సక్సెస్‌ అవ్వాలనే ఏ హీరో అయినా అనుకుంటాడు, అలానే వరుణ్‌ కూడా చేస్తున్న సినిమాపై చాలా నమ్మకంతో ఉంటాడు. అంతిమంగా అదృష్టం కలిసి రావాలంటాడు వరుణ్‌ సక్సెస్‌ గురించి మాట్లాడేటప్పుడు.

గత సినిమా వైఫల్యాలతో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ‘పడ్డానండీ ప్రేమలో పడి’ అనే సినిమా చేశాడట వరుణ్‌ సందేశ్‌. ఈ సినిమా ఖచ్చితంగా విజవంతమవుతుందని వరుణ్‌ సందేశ్‌ చెప్పాడు. సినిమా ఆడియో ఫంక్షన్‌లో, ఇప్పటిదాకా చేసిన సినిమాలతో పోల్చితే విభిన్నమైన కథాంశంతో రూపొందిన ‘పడ్డానండీ ప్రేమలో మరి’ తనకు గొప్ప విజయాన్ని అందిస్తుందని అంటున్నాడు.

యువతరానికి మంచి మెసేజ్‌ ఇవ్వడంతోపాటు, ఫ్యామిలీస్‌ని కూడా థియేటర్లకు రాబట్టే సినిమా అని ‘పడ్డానండీ ప్రేమలో’ సినిమా గురించి చెప్పిన వరుణ్‌, నిర్మాత ఎక్కడా రాజీ పడలేదనీ, దర్శకుడు ఓ యజ్ఞంలా సినిమా తెరకెక్కించారనీ వివరించాడు. వరుణ్‌ సందేశ్‌ సరసన వితిక శేరు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

మరిన్ని సినిమా కబుర్లు
great begin for tollywood