Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
venky with planning

ఈ సంచికలో >> సినిమా >>

న్యూడ్‌ సెల్ఫీ నాది కాదు: రాధిక

Not me that nude selfie radhika

నటనలో మేటి అనిపించుకున్న ‘రక్తచరిత్ర’ ఫేం రాధికా ఆప్టేకి ‘న్యూడ్‌ సెల్ఫీ’ కష్టాలు తెచ్చిపెట్టింది. మార్ఫింగ్‌ బారిన పడి అంతులేని ఆవేదనకు గురవుతోంది రాధికా ఆప్టే. బాలకృష్ణతో ‘లెజెండ్‌’ సినిమాలో నటించిన రాధికా ఆప్టే, నటిగా విభిన్న చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల మన్నన పొందుతోంది. అంతలోనే ఆమెను న్యూడ్‌ సెల్ఫీ వివాదాల్లోకి లాగింది.‘నాకు తెలియని విషయంపై నేనెలా స్పందిస్తాను? నేను చేయగలిగిందల్లా ఒక్కటే.. అదేమిటంటే ఆ సెల్ఫీ నాది కాదని ఖండిరచడం’ అంటున్న రాధికా ఆప్టే, తాను సినిమాల్లో బిజీగా ఉన్నాననీ, ఇలాంటి వాటిని పట్టించుకునేంత తీరిక లేదని వివరించింది. పని లేనోళ్ళు, ఖాళీగా ఉండి ఏమీ తోచక చేసే పనికిమాలిన పనిగా న్యూడ్‌ సెల్ఫీ గురించి రాధిక స్పందించింది. బాలకృష్ణతోనే ‘లయన్‌’ సినిమాలో కూడా నటిస్తోంది రాధికా ఆప్టే. ప్రకాష్‌రాజ్‌ రూపొందించిన ‘ధోని’ సినిమాలో మంచి నటన ప్రదర్శించిన ఈ అందాల భామ, గాసిప్స్‌ సినీ రంగంలో తప్పవుగానీ, క్యారెక్టర్‌ ఎసాసినేషన్‌ చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాల్సి ఉందని అభిప్రాయపడిరది. మార్ఫింగ్‌ ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నవారు, తమ ఇంట్లోనూ ఆడవాళ్ళున్నారనే విషయం మర్చిపోతున్నారని చెప్పింది.

మరిన్ని సినిమా కబుర్లు
manchu laxmi dongata