Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
mistery

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంటిల్లు - అమ్మమ్మ పప్పు చారు - పి. పద్మావతి

ammamma pappucharu

'వంటిల్లు' కు స్వాగతం!
సులభంగా చేసే తెలుగు వంటల్ని ' గోతెలుగు' మీ కందిస్తుంది. ఈ సంచికలో ' అమ్మమ్మ పప్పు చారు' ఎలా చేయాలో తెలుసుకుందాం!


'అమ్మమ్మ పప్పు చారు' తయారుచేయు విధానం!


ముందుగా కందిపప్పును ఉడికించి వుంచుకోవాలి. ఉడికించిన కందిపప్పును గరిటతో మెత్తగా మెదుపుకొని, ఉల్లిపాయలు పెద్దముక్కలు (ఒక ఉల్లిపాయ), టమాట ముక్కలు (ఒక టమాట), నిలువుగా చీరిన 6 పచ్చిమిర్చిలు, కరివేపాకు (2రెబ్బలు), కొద్దిగా కొత్తిమీర, చింతపండు పులుసు (తగినంత), ఉప్పు (రుచికి తగినంత), పసుపు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.
చక్కగా మరిగిన ' పప్పు చారు' కు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 2 వెల్లుల్లి రేకులుతో నేతి తాలింపు పెట్టుకోవాలి. కొత్తిమీర చల్లి ఘుమఘుమ లాడే పొగల కక్కే  'పప్పు చారు' ఆరగించడానికి రెడీ!


అప్పడాలు / వడియాలు నంజుకుంటే 'ఆహా...' అంటారు!!

మరిన్ని శీర్షికలు