Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
kula charitra - naveena sharma

ఈ సంచికలో >> శీర్షికలు >>

మరణం తరువాత(గజల్) - శ్రీనివాస్ ఈడురి

చూడాలని ఉంది నాకు చందమామ వెనుక కూడా
చేరాలని ఉంది నాకు దిగంతాల ఆవల కూడా

ఉరకలేసే లేత మనసు అణిగి మణిగి ఉండలేదు
ఆడాలని ఉంది నాకు బాల్యం  తరువాత కూడా

మనసు తోడు రాకుంటే విజయానికి విలువెక్కడ
గెలవాలని ఉంది నాకు ఓటమి తరువాత కూడా

కూడు పెట్టు విద్య గోడు తీర్చలేదు కదా
చదవాలనుంది నాకు డిగ్రీల తరువాత కూడా

ప్రేమ అమరమనుకుంటే అంతమన్న మాటెందుకు
రమించాలనుంది నాకు ప్రణయం తరువాత కూడా

నిన్ను నువ్వు తెలుసుకోని పూజలేల ఈడూరీ
తపించాలనుంది నాకు మోక్షం తరువాత కూడా

కానరాని లోకాలపై మమకారం నాకెందుకు
బతకాలని ఉంది నాకు మరణం తరువాత కూడా

మరిన్ని శీర్షికలు
Errapragada Ramakrishna 'chengalva poodanda': Book review