Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cini churaka

ఈ సంచికలో >> సినిమా >>

‘ఠాగూర్‌’ కన్నా పెద్ద హిట్‌ అవుతుందా?

'Tagore' than to be a big hit?

తమిళంలో విజయకాంత్‌ హీరోగా నటించిన ‘రమణ’ సినిమానే తెలుగులో ‘ఠాగూర్‌’గా తీశారు. తమిళంలో ‘రమణ’ పెద్ద హిట్‌. దానికన్నా సూపర్‌ హిట్‌ ‘ఠాగూర్‌’. హిందీలో ‘గబ్బర్‌’గా తీస్తున్నారు ఈ సినిమాని. హీరో అక్షయ్‌కుమార్‌ ‘గబ్బర్‌’ సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని అంటున్నాడు.తెలుగు, తమిళ వెర్షన్లలో హీరోలు చిరంజీవి, విజయ్‌కాంత్‌ నీట్‌ లుక్‌తో కనిపించగా, హిందీలో అక్షయ్‌కుమార్‌ మాస్‌ లుక్‌తో మాసిన గడ్డంతో కనిపించనున్నాడు. తెలుగు కన్నా, తమిళం కన్నా పవర్‌ఫుల్‌గా ‘గబ్బర్‌’లో హీరో క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారట. తమిళ వెర్షన్‌నీ, తెలుగు వెర్షన్‌నీ పక్క పక్కన పెట్టి, ఈ రెండిట్లోని స్ట్రాంగ్‌ ఎలిమెంట్స్‌ తీసుకుని, ఫైనల్‌గా చాలా పెర్‌ఫెక్ట్‌ ప్రోడక్ట్‌గా ‘గబ్బర్‌’ని రూపొందించారట.ఖర్చు పరంగా చూసినా చాలా భారీతనంతో తెరకెక్కింది ‘గబ్బర్‌’. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో. ‘పీకే’ సినిమాని దాటి వసూళ్ళు సాధిస్తుందా? అని ప్రశ్నిస్తే, కమర్షియల్‌ అంశాలతోపాటు సొసైటీకి మంచి మెసేజ్‌ ఇచ్చే సినిమా కావడంతో పెద్ద హిట్‌ అవుతుందని చెప్పగలనుగానీ, రికార్డుల గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అక్షయ్‌కుమార్‌ అన్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
Abhishek  guest role for Aishwarya